కాబోయే టాప్ హీరో ఎవరు?

చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ వీళ్లే ప్రస్తుతం టాలీవుడ్ వంద కోట్ల హీరోలు. వీళ్లంతా యాభై కోట్ల మార్క్ దాటేసి చాలాకాలం అయింది. కానీ ఆ తరవాత వారి…

చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ వీళ్లే ప్రస్తుతం టాలీవుడ్ వంద కోట్ల హీరోలు. వీళ్లంతా యాభై కోట్ల మార్క్ దాటేసి చాలాకాలం అయింది. కానీ ఆ తరవాత వారి పక్కకు మాత్రం ఎవ్వరూ రావడంలేదు. ఈ సరసకు రాగలిగిన మరో హీరో ఎవరు? కనీసం యాభై కోట్ల మార్కెట్ వున్న హీరోలు ఎవరన్నా వున్నారా? పైగా ఇప్పుడున్న టాప్ హీరోలు ఒకరిద్దరు నలభైలు దాటేసినవారు. మరికొందరు ముఫైలు దాటేసి, నలభైలకు దగ్గరవుతున్నవారు.

నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ. వరుణ్ తేజ్ చైతన్య, అఖిల్, సాయిధరమ్, నితిన్ ఇలా ఈ లిస్ట్ చాలావుంది. తెలుగులో వున్నంత మంది యంగ్ హీరోలు మరే భాషలోనూ లేరు అన్న టాక్ కూడా వుంది. కానీ ఎవ్వరూ ముఫైకోట్ల థియేటర్ మార్కెట్ దాటడంలేదు. నానికి ఒకటి రెండు సినిమాలు, విజయ్ కు ఒక సినిమా, వరుణ్ తేజ్ కు ఒకటి రెండు సినిమాలు మాత్రమే యాభై కోట్ల మార్క్ దాటాయి. అవి కూడా విడుదలకు ముందు థియేటర్ మార్కెట్ ముఫై కోట్లకు కాస్త అటు ఇటుగా మాత్రమే.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నా, విజయ్ దేవరకొండ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు పాతికకోట్లు దాటలేదు. ఇప్పుడు నాన్ థియెటర్ హక్కులు పెరిగాయి కాబట్టి, నాని, విజయ్ ల మీద ముఫై నుంచి ముఫై అయిదు కోట్ల వరకు పెట్టగలగుతున్నారు. లేదూ అంటే ముఫై కోట్ల రేంజ్ లోనే సినిమాలు తీయాల్సిన పరిస్థితి. నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు యాభైకోట్లు, విజయ్ హీరో సినిమాకు యాభైకోట్లు పెడుతున్నారు అంటే కేవలం నాన్ థియేటర్ హక్కులను నమ్ముకునే.

టాప్ హీరోల మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో 70 నుంచి 80కోట్ల రేంజ్ లో థియేటర్ హక్కులు పలికే పరిస్థితి లేదు. పోనీ అలా అని టాప్ డైరక్టర్లతో సినిమాలు చేస్తే పరిస్థితి మారుతుంది అని అనుకోవడానికి కూడా లేదు. నితిన్-తివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తే, నలభైకోట్ల మేరకు రావడం కష్టమయింది. పైగా టాప్ డైరక్టర్ల రెమ్యూనిరేషన్ తో యంగ్ హీరోల సినిమాల ప్రొడక్షన్ అయిపోయే పరిస్థితి. అందుకే టాప్ డైరక్టర్ లు ఈ యంగ్ హీరోల కాంబినేషన్ లు సెట్ చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రావడంలేదు.

కాంబినేషన్ లేకుండా యంగ్ హీరోలు యాభైకోట్ల దాటే థియేటర్ మార్కెట్ తెచ్చుకోవడం కష్టం. యంగ్ హీరోల తెలుగ రాష్ట్రాల థియేటర్ మార్కెట్ ప్రస్తుతానికి అయితే పాతిక కోట్లకే ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. కాస్త దాటుదాం అనేసరికి ఓ ప్లాపు వచ్చి పడుతోంది.

శర్వాకు పడిపడి లేచెమనసు, విజయ్ కు డియర్ కామ్రేడ్, చైతన్యకు సవ్యసాచి, శైలజరెడ్డి అల్లుడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో బ్రేక్ పడుతోంది. దాంతో ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు వుంటోంది. ఈ బాలారిష్టాలు అధిగమించి, టాప్ హీరోల సరసన ప్లేస్ సంపాదించగల యంగ్ హీరో ఎవరో?

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు