‘కామ్రేడ్’కు కోత పడింది

డియర్ కామ్రేడ్.. వీర బజ్ మధ్య విడుదలైన విజయ్ దేవరకొండ సినిమా. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచి వినవచ్చిన కంప్లయింట్ ఒకటే. లెంగ్త్ ఎక్కువ. ఆ తరువాత కంప్లయింట్ సినిమా స్లోగా వుంది…

డియర్ కామ్రేడ్.. వీర బజ్ మధ్య విడుదలైన విజయ్ దేవరకొండ సినిమా. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచి వినవచ్చిన కంప్లయింట్ ఒకటే. లెంగ్త్ ఎక్కువ. ఆ తరువాత కంప్లయింట్ సినిమా స్లోగా వుంది అన్నది. ఇప్పుడు ఈ లెంగ్త్ ఎక్కువ అన్న దాని మీద యూనిట్ దృష్టిపెట్టింది. బయ్యర్లు కూడా సినిమా లెంగ్త్ కట్ చేస్తే కాస్త బాగుంటుంది అని చెప్పడంతో, సినిమా నిడివిని 13 నిమషాల పాటు తీసేసారు.

సినిమా విడుదలయిన తరువాత జరిగిన మీడియా మీట్ అనంతరం విజయ్ ఈ విషయాన్ని చూచాయిగా వెల్లడించాడు. పలుచోట్ల కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ 13 నిమిషాలు లేపి, మళ్లీ క్యూబ్ లు అవీ సెట్ చేసేసరికి రెండురోజులు పట్టింది. నిన్నటి సాయంత్రం నుంచి ఈ తగ్గింపు వెర్షన్ థియేటర్లలోకి వచ్చింది.

అంతేకాదు, ప్రారంభంలో తీసేసిన కేంటీన్ సాంగ్ ను మళ్లీ జోడించారు. ఆ పాట యూత్ ను అట్రాక్ట్ చేస్తుందని భావించి, దాన్ని జోడించారు. మరీ తీసివేత, ఆ జోడింపు కలిసి సినిమాను మండే నుంచి పడిపోకుండా ఆపుతాయేమో చూడాలి.

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు