ఆగస్టు మిడ్ వరకు వచ్చేసాం. ఇప్పుడిప్పుడే సినిమాలు కుదుటపడుతున్నాయి. థర్డ్ వేవ్ వుంటుందన్న అనుమానాలు తగ్గుతున్నాయి. జనం నార్మల్ గా తిరిగేస్తున్నారు. కేవలం నైట్ కర్ప్యూ అన్నది ఒక్కటే, అది కూడా ఆంధ్రలో వుంది. అది ఒక్కటి తీసేస్తే. సినిమాల వ్యవహారం నార్మల్ అయిపోతుంది.
రోజుకు నాలుగు ఆటలు వేసుకోవచ్చు. ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ అన్నది పెద్ద సమస్య కాదు. టికెట్ రేట్లు కూడా చిన్న, మీడియం సినిమాల వరకు కాస్త సర్దు కోవచ్చు. ఓ రెండు వారాలు గ్యాప్ ఇస్తే అన్నీ సర్దుకుంటాయని సినిమా జనాలు నమ్మకంగా వున్నారు. అందుకే అందరూ వినాయక చవితి డేట్ మీద కన్నేసారు.
లవ్ స్టోరీ, సీటీమార్, వరుడు కావలెను ఈ మూడు సినిమాలు కూడా సెప్టెంబర్ మొదటి వారంలో కాస్త గ్యాప్ లతో విడుదల కావాలని చూస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ కూడా ఇదే లైన్ లో వస్తుంది.
ఇంక లాస్ట్ స్టేజ్ లో వున్న చాలా సినిమాలు ఇప్పుడు స్పీడ్ అందుకున్నాయి. అవన్నీ సెప్టెబర్ నుంచి అక్టోబర్ లోపు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13కు ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని ఇండస్ట్రీ జనాలు బలంగా నమ్ముతున్నారు.