దిల్ రాజుకు విజయ్ నో?

దిల్ రాజు నిర్మాత అంటే సినిమా చేయము అనే హీరో దాదాపు తెలుగులో లేరు. ఎందుకంటే కేవలం సినిమా తీయడంకాదు, వీలయినంత మంచి స్క్రిప్ట్, మంచి కాంబినేషన్, మంచి రిలీజ్ సెట్ చేస్తారు ఆయన.…

దిల్ రాజు నిర్మాత అంటే సినిమా చేయము అనే హీరో దాదాపు తెలుగులో లేరు. ఎందుకంటే కేవలం సినిమా తీయడంకాదు, వీలయినంత మంచి స్క్రిప్ట్, మంచి కాంబినేషన్, మంచి రిలీజ్ సెట్ చేస్తారు ఆయన. అందుకే దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసారు. చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే, ఆయనే పూనుకుని, సరిలేరు నీకెవ్వరు సినిమాలో దిల్ రాజును యాడ్ చేసారు.

కానీ అదే దిల్ రాజుకు ఓకె చెప్పడంలో మాత్రం విజయ్ దేవరకొండ దూరంగా వుంటున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా దిల్ రాజు ఓ సినిమా చేద్దామని విజయ్ కు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దానికి విజయ్ ఎస్ అనీ చెప్పకుండా, నో అనీ చెప్పకుండా వున్నట్లు తెలుస్తోంది. చూద్దాం.. చేద్దాం అనే తప్ప, ఓకె అనడంలేదు అని దిల్ రాజే సన్నిహితుల దగ్గర చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఓ డైరక్టర్ కూడా దిల్ రాజు కాంబినేషన్ లో విజయ్ తో సినిమా చేయాలకున్నారు. దిల్ రాజుతో కాకుండా వేరే నిర్మాతతో ట్రయ్ చేస్తే విజయ్ డేట్ లు దొరుకుతాయి అని ఆ డైరక్టర్ కు సలహాలు అందుతున్నట్లు తెలుస్తోంది. మరి విజయ్ కు దిల్ రాజుకు మధ్య ఎందుకీ గ్యాప్ అన్నదే తెలియదు. ఒక సినిమా అనౌన్స్ అయిపోతే ఈ గ్యాసిప్ లు ఆగిపోతాయేమో?

డియర్ కామ్రేడ్ పై దర్శకుడి కష్టాలు

ఈవారం గ్రేట్ ఆంధ్ర స్పెషల్ వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి