నేతల కొట్లాట.. ప్రజల్లో విసుగు, విరక్తి!

బయటివాళ్లకు అయితే కర్ణాటక రాజకీయాలు వినోదంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ విషయం గురించి కన్నడీగుల వద్ద ఆరాతీస్తే మాత్రం తమ రాష్ట్ర రాజకీయంపై వారిలో అంతులోని విసుగు, విరక్తి కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఆ పార్టీ…

బయటివాళ్లకు అయితే కర్ణాటక రాజకీయాలు వినోదంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ విషయం గురించి కన్నడీగుల వద్ద ఆరాతీస్తే మాత్రం తమ రాష్ట్ర రాజకీయంపై వారిలో అంతులోని విసుగు, విరక్తి కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఆ పార్టీ ఈ పార్టీ అనికాదు.. తమ రాష్ట్ర రాజకీయంలో అన్నిపార్టీలు వ్యవహరిస్తున్న తీరును కూడా అక్కడి ప్రజలు విసుక్కొంటున్నారు.

రాజకీయ అనిశ్చితి వారికి రాజకీయ నేతల తీరుమీద విసుగును పుట్టిస్తూ ఉంది. తీవ్రమైన రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడటం, పద్నాలుగు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం ప్రజల్లోనే అసహనాన్ని రేపుతూ ఉంది. తాము అభిమానించే పార్టీ అధికారంలో ఉండటం, ఉండకపోవడం సంగతలా ఉంచితే.. ఎవరో ఒకరు పీఠం మీద కూర్చుని పాలన సజావుగా సాగిస్తే మేలనే భావన కన్నడ ప్రజల నుంచి వ్యక్తం అవుతూ ఉంది.

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొత్తది ఏమీకాదు. బహుశా రెండే పార్టీల రాజకీయం ఉండి ఉంటే ఇలాంటి ప్రతిష్టంభనలు ఏర్పడేవి కావేమో. మూడుపార్టీలు ఓటు షేర్‌ను కలిగి ఉండటంతో రాజకీయంగా అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి.

ఇంతవరకూ కర్ణాటక చరిత్రలో ఐదేళ్ల పూర్తికాలం ముఖ్యమంత్రులుగా వ్యవహరించింది కేవలం ముగ్గురంటే ముగ్గురే అనే విషయం గమనించాకా ఆశ్చర్యం కలగక మానదు. ఐదేళ్లపాటు ప్రజలు ఏ ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించినా వారు పూర్తికాలం అధికారంలో ఉండటంలేదు. పూర్తి మెజారిటీలు రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, బోటాబోటీ మెజారిటీలతో అవి ఎక్కువకాలం ఉండకపోవడం.. ఇలాంటి పరిణామాలే ఏర్పడుతూ ఉన్నాయి.

ఇటీవలే అలాంటి రాజకీయంలో ఒక అంకం ముగిసింది. అయితే అప్పుడే అది పూర్తికాలేదు. కర్ణాటక రాజకీయంలో ఈ నాటకాలు మరికొంత కాలం కొనసాగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. పాత ప్రభుత్వం కూలింది, కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది.. మరి ఇదెన్నాళ్ల ముచ్చటో అంతుబట్టని రీతిలో ఉన్నారు అక్కడి ప్రజలు.
-ఎల్‌.విజయలక్ష్మి

డియర్ కామ్రేడ్ పై దర్శకుడి కష్టాలు

ఈవారం గ్రేట్ ఆంధ్ర స్పెషల్ వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి