కనిపించిన అమ్మాయి..అమ్మడు..అతివ..ఇలా ఏజ్ తో సంబంధం లేకుండా పదహారు వందల మందికి ఐ లవ్ యూ అని చెప్పిన కుర్రాడు నిజంగా నికార్సుగా ప్రేమలో పడితే ఎలా వుంటుంది అన్నది పాగల్ సినిమా లైన్. అది ట్రయిలర్ లో అస్సలు దాచకుండా చెప్పేసారు..చూపించేసారు.
అసలు సిసలు ప్రేమలో పడేవరుకు కుర్రకారు వేసే పాగల్ వేషాలు అన్నీ వేసేసి, ప్రేమలో పడ్డాక ఆ బాధలు, విరహాలు మరో కోణంగా ముడేసిన సినిమా అని ట్రయిలర్ క్లారిటీగా చెప్పేసింది. విష్వక్ సేన్ అన్న పాయింట్, యాడెడ్ అడ్వాంటేజ్ మాత్రమే ట్రయిలర్ ను చూసేలా చేసింది తప్ప, మిగిలినదంతా సేమ్ టు సేమ్ ఓల్డ్ పాట్రన్ నే.
ట్రయిలర్ కూడా క్రేజీగా ఏమీ లేదు పెద్దగా. కరోనా వున్నవాడితో అయినా తిరగొచ్చు కానీ నీలా కరువెత్తిపోయేవాడితో తిరక్కూడదనే పంచ్ డైలాగు బాగానే పేలింది.
ఎంత అల్లరి చేసాడు హీరో..ఎంత పెయిన్ చూపించగలిగాడు డైరక్టర్ అన్నదాన్ని బట్టి సినిమా జనాలకు దగ్గరకావడం అనేది ఆధారపడి వుంటుంది. ప్రస్తుతానికి ట్రయిలర్ అయితే జస్ట్ పాస్.