మలయాళంలో విడుదలైన చిన్న సినిమా నయాట్టు. ఓటిటి లో విడుదలైన ఈ సినిమా అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో గీతా సంస్థ టేకప్ చేసింది.
పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలు అందించిన దర్శకుడు కరుణ్ కుమార్ ఈ సినిమాను రూపొందిస్తారు. సినిమాలో రెండు కీలకమైన పోలీస్ పాత్రలకు రావు రమేష్, శ్రీవిష్ణులను ఎంపిక చేసారు.
రావు రమేష్ కు కచ్చితంగా వైవిధ్యమైన పాత్ర అవుతుంది. ఇలాంటి క్యారెక్టర్ ను ఇప్పటి వరకు చేయలేదు. మూడో కీలకపాత్ర అయిన లేడీ కానిస్టేబుల్ గా ఎవరు నటిస్తారు అన్నది ఇంకా డిసైడ్ కాలేదు.
తక్కువ వ్యయంతో తయారైన నయాట్టు సినిమా థ్రిల్లర్లలో కొత్త తరహాగా తయారైంది. కచ్చితంగా తెలుగులో కూడా ఆకట్టుకునే అంశాలు ఈ కథకు వున్నాయి.