విశాఖకు ముందే దసరా పండుగ

విశాఖ ఐటీ రాజధానిగా మారుతోంది. ఈ అక్టోబర్ నెలలో రెండు పెద్ద ఐటీ కంపెనీలు విశాఖలో తమ కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. అందులో ప్రముఖమైన సంస్థగా ఉనన్ ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖ ఐటీ…

విశాఖ ఐటీ రాజధానిగా మారుతోంది. ఈ అక్టోబర్ నెలలో రెండు పెద్ద ఐటీ కంపెనీలు విశాఖలో తమ కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. అందులో ప్రముఖమైన సంస్థగా ఉనన్ ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖ ఐటీ సెజ్ లో తన యాక్టివిటీస్ ని పెద్ద ఎత్తున  స్టార్ట్ చేస్తోంది. ఒక విధంగా విశాఖకు దసరా పండుగను ముందే తెస్తోంది అన్న మాట.

మొదట వేయి మంది ఉద్యోగుల సామర్ధ్యంతో ఇన్ఫోసిస్ విశాఖలో తన ఆఫీస్ తెరవబోతోంది. మెల్లగా ఆ సంఖ్య మూడు వేలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇన్ఫోసిస్ రాక అంటే విశాఖ ఐటీకి కొత్త ఠీవి వచ్చినట్లే అని చెబుతున్నారు.

ఇన్ఫోసిస్ తో పాటే మరో ఐటీ సంస్థ డల్లాస్ టెక్నాలజీస్ కూడా విశాఖకు తరలివస్తోంది. ఈ సంస్థ ఉక్కునగరంలో తన కార్యకలాపాలను అక్టోబర్ లోనే ప్రారంభిస్తుంది అని తెలుస్తోంది. 

అంటే రెండు ఐటీ సంస్థలు ఒకే టైమ్ లో విశాఖకు రావడం అన్నది వైజాగ్ సిటీ ఖ్యాతిని పెంచేదిగా చూడాలని ఐటీ నిపుణులు అంటున్నారు. వీటి ద్వారా ఉపాధి అవకాశాలు భారీగా వస్తాయని చెబుతున్నారు.