గాడ్ ఫాదర్ కు థియేటర్ల సమస్య?

నైజాంలో మళ్లీ థియేటర్ల సమస్య వస్తున్నట్లు కనిపిస్తోంది. థియేటర్ల లేక, తక్కువై కాదు. డిస్ట్రిబ్యూషన్ హక్కుల వ్యవహారం తెరవెనుక అసలు నాటకం నడిపిస్తోందన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుస.  Advertisement విషయం ఏమిటంటే నైజాంలో…

నైజాంలో మళ్లీ థియేటర్ల సమస్య వస్తున్నట్లు కనిపిస్తోంది. థియేటర్ల లేక, తక్కువై కాదు. డిస్ట్రిబ్యూషన్ హక్కుల వ్యవహారం తెరవెనుక అసలు నాటకం నడిపిస్తోందన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుస. 

విషయం ఏమిటంటే నైజాంలో గాడ్ ఫాదర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ ముందుగా దిల్ రాజు/శిరీష్ అని వినిపించింది. నిర్మాత ఎన్వీ ప్రసాద్ సినిమాను నేరుగా పంపిణీ చేసుకుందాం అనుకున్నపుడు సంగతి ఇది. కానీ ఓ మాంచి పార్టీ దొరికింది. మాంచి రేటు దొరికింది.

అక్కడే వచ్చింది సమస్య. 22 కోట్లకు నైజాం హక్కులు తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూటర్ సినిమాను ఆసియన్ సునీల్ దగ్గర వుంచారు. మరి వాళ్లిద్దరికి ఏం డీల్ కుదిరిందో తెలియదు. దీంతో సహజంగానే దిల్ రాజు/శిరీష్ లకు కోపం వచ్చిందని బోగట్టా. 

ఇలాంటి విషయాల్లో దిల్ రాజు కాస్త సంయమనంతో వుంటారు. డిప్లమాటిక్ గా వ్యవహరిస్తారు కానీ శిరీష్ కు అలాంటిదేం వుండదు. రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నామా అన్నది చూడరు అని ఇండస్ట్రీ జనాలు అంటారు.

మొత్తం మీద ఇప్పుడు మళ్లీ శిరీష్ కు కోపం వచ్చినట్లుంది. సుదర్శన్ లాంటి మెయిన్ థియేటర్ గాడ్ ఫాదర్ కు కానీ ఘోస్ట్ కు కానీ ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 30 న పిఎస్ వన్ సినిమా వుంది. అది దిల్ రాజు/శిరీష్ పంపిణీనే. ఈ సినిమాను థియేటర్లలో ఎలాగూ మినిమమ్ వన్ వీక్ వుంచుతారు. బాగుంటే కంటిన్యూ చేస్తారు. 

అలా చేస్తే చాలు…కర్ర విరగకుండానే పామును కొట్టొచ్చు అనేలా వుంటుంది. మొత్తం మీద ప్రస్తుతం ఆసియన్ సునీల్ చేతిలోకి గాడ్ ఫాదర్ సినిమా రావడం అన్నది దిల్ రాజు/శిరీష్ ల కోపానికి కారణం అయిందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.