దర్శకుడు హరీష్ సెటైర్లకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటారు. అక్కడ అప్పుడప్పుడు వేసే పంచ్ లు భలే గా వుంటాయి. ఎవరికైనా సమాధానం చెప్పాల్సి వచ్చినపుడు, సరైన కౌంటర్ ఇవ్వాలనుకున్నపుడు ఆయన వాడే పదజాలం భలేగా వుంటుంది. అలాంటి పంచ్ ఫలక్ నామా కే పంచ్ ఇచ్చింది హీరోయిన్ రెజీనా.
అసలే రెజీనా ఈ మధ్య చాలా ఫైర్ మీద వుంది. మాటకు మాట..కౌంటర్ కు కౌంటర్ అన్నట్లు వుంటోంది. అలాంటి రెజీనాను హరీష్ శంకర్ మరచిపోయారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా వచ్చి ఏడేళ్లయింది. ఆ సందర్భంగా హీరో సాయి ధరమ్ తేజ్ కు, ఆ సినిమాకు, హీరోకి సన్నిహితుడు సతీష్ కు అభినందనలు తెలియచేస్తూ ఓ ట్వీట్ పెట్టారు హరీష్. అక్కడితో కథ ముగిసిపోలేదు. ఎందుకంటే హీరోయిన్ రెజీనాను మరచిపోయారు కదా?
దీనికి రెజీనా భలే కౌంటర్ ట్వీట్ వేసింది.
ఈ ఇంగ్లీష్ టంగ్ ట్విస్టింగ్ డ్రాఫ్టింగ్ లో వెదుక్కున్నవారికి వెదుక్కున్నన్ని అర్థాలు కనిపిస్తున్నాయి. నో క్యారెక్టర్…అన్న శ్లేష దగ్గర జనాలు చాలా అర్థాలు వెదుక్కుంటున్నారు. మరోపక్క చేతిలో సినిమాలు లేక రెజీనా ఫ్రస్టేషన్ లో వుందని, అటెన్షన్ కోసం ఇలాంటి వన్నీ చేస్తోందనీ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ట్వీట్ కు మాత్రం హరీష్ కౌంటర్ ఇవ్వలేదు. సింపుల్ గా సారీతో సరిపెట్టారు.
Looks like my #SFS director has no character(s) left to mention the rest of us. @harish2you thank you for inspiring “Sita tho antha easy kadhu.”