“ఎన్.టి.ఆర్, వై.ఎస్.ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వై.ఎస్.ఆర్ స్థాయిని పెంచదు, ఎన్.టి.ఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్.టి.ఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు”
ఈ ట్వీటు జూ.ఎన్.టి.ఆర్ పెట్టాడు కానీ ఇందులోని ప్రతి అక్షరం బాలకృష్ణ నుంచి రావాల్సింది. ఎందుకంటే ఎన్.టి.ఆర్ కి, వై.ఎస్.ఆర్ కి సమానమైన కృతజ్ఞత చూపించాల్సిన వ్యక్తి బాలకృష్ణే.
ఎన్.టి.ఆర్ లేనిదే బాలకృష్ణ లేడు. కొడుకుగానూ, నటుడిగానూ జన్మనిచ్చింది ఆయనే. ఆ చెట్టంత మనిషిని చంద్రబాబు కూల్చేస్తుంటే ప్రతిఘటించకుండా బావతో చేయికలిపి ద్రోహం చేసాడు. అయినా ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా కాలక్రమంలో తన కూతుర్ని అదే చంద్రబాబు కొడుకుకిచ్చి తండ్రి ఆత్మకు చనిపోయాక కూడా శాంతి లేకుండా చేసాడు. ఆ పితృద్రోహం ఎన్ని జన్మలెత్తినా తీరదు. ఇప్పటికిప్పుడు బావతో విరోధం తెచ్చుకుని అతని పతనానికి, మానసిక క్షోభకు కారణమైతే తప్ప వచ్చే జన్మల్లో ఆ పాపం ఇతనిని పీడించడం ఖాయం.
ఇక బాలకృష్ణకి రెండో జన్మ ప్రసాదించినది వై.ఎస్.ఆర్. బాలయ్య బాబు ఇంట్లో తుపాకి పట్టుకుని ఢాం ఢాం అనిపించిన వార్త తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఏదో పుణ్యం వల్ల నిర్మాత బెల్లంకొండ, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి బతికి బట్టగట్టారు కానీ లేకపోతే బాలయ్య బాబు హంతకుడిగా మిగిలిపోవాల్సి వచ్చేది. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్.
నిజంగా వై.ఎస్.ఆర్ కి అది రాజకీయంగా సువర్ణావకాశం. బాలకృష్ణని జైల్లోకి తొసుంటే ఎప్పటికీ “బావది వెన్నుపోటు- బావమరిదిది ఎదురు కాల్పు” అని ట్రోలింగ్ చేస్తూ కొన్ని వందల రాజకీయప్రసంగాల్లో వాడుకునే అవకాశముండేది (ఇప్పుడు ఎ1, ఎ2 అని వెక్కిరిస్తున్నట్టుగా). కానీ వై.ఎస్.ఆర్ ఆ పని చెయ్యలేదు. శత్రువైనాసరే శరణు వేడితే ఆలోచించాలని ధర్మం చెబుతుంది.
విక్టింస్ కూడా రాజీపడ్డారు కాబట్టి చంద్రబాబు మరియు నందమూరి కుటుంబసభ్యులు ప్రాధేయపడితే జైలు శిక్ష పడకుండా యంత్రాంగాన్ని తన స్థాయిలో నడిపించాడు వై.ఎస్.ఆర్. అది న్యాయబద్ధం కాదని తెలిసినా శరణు వేడిన వాడికి అభయం ఇవ్వాలనే ధర్మంతో బలకృష్ణకి కారాగారవాసాన్ని తప్పించాడు. అప్పటికి ఎర్రగడ్డ ప్రభుత్వాసుపత్రి బాలకృష్ణ పిచ్చివాడని సర్టిఫికేట్ కూడా ఇచ్చింది.
ఇంత జరిగినా అవకాశవాదంతో బుసలు కొడుతూ వెన్నుపోటు విషాన్ని చిమ్మే చంద్రబాబు వర్గం వై.ఎస్.ఆర్ మరణించాక ఏం చేసింది?
కాంగ్రెస్ పార్టీతో కలిసి, చీకటి రాజకీయాలు చేసి వై.ఎస్. జగన్ ని రకరకాల కేసుల్లో బిగించి నెలలతరబడి జైల్లో మగ్గేలా చేసింది.
అంటే కాల్పులు జరిపి హత్యాప్రయత్నం చేసిన బాలకృష్ణ జైలుకెళ్లకుండా కాపాడినవాడి కొడుకుని అన్నేసి నెలలు జైల్లోనే బతికేలా చేసిన కుట్రదారుడు చంద్రబాబు. ఇందులో బాలకృష్ణ పాత్ర నేరుగా లేకపోవచ్చు కానీ,ఆ అన్యాయాన్ని మౌనంగా చూస్తూ వై.ఎస్.ఆర్ మీద ఏ మాత్రం కృతజ్ఞత చూపకుండా జగన్ మోహన్ రెడ్డిపై విషం కక్కడం అతని నక్కతనానికి నిదర్శనం.
తన ఫోటోని ప్రాంగణంలో పెట్టలేదన్న ఇగోతో ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వై.ఎస్ జగన్ మార్చాడని అంటున్నారు. ఏం? అప్పటివరకు చంద్రబాబు ఫోటో పెట్టి ఆ స్థానంలో కొత్తగా ఎన్నికైన జగన్ మోహన్ రెడ్డి ఫోటో పెట్టమనడం తప్పా? జగన్ ది ఇగో అయితే మరి ఆ హెల్త్ యూనివర్సిటీ ప్రబుద్ధులది బలుపు కాదా!
తాము ఫీలైతే ఆత్మాభిమానం, జగన్ ఫీలైతే ఇగో. తాము చేస్తే రాజకీయం. జగన్ చేస్తే రాక్షసత్వం.
ఏంటీ దరిద్రం?
తమని తాము పాండవుల్లాగ, చంద్రబాబుని ధర్మరాజులాగ అభివర్ణించుకుంటూ బతికేయడం మరొక అమాయకత్వం.
ఎవరు పాండవులో, ఎవరు కౌరవులో తెలుస్తూనే ఉంది. నిజంగా ధర్మం చంద్రబాబు పక్షాన ఉండుంటే దేవుడు కూడా వైకాపాకి ఇంత అవకాశం ఇవ్వడు. చేసిన దుశ్చర్యలకి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు తప్ప ఇప్పుడు విక్టిం కార్డు ప్లే చేసేంత సీన్ తెదేపాకి లేదు.
2024లో వై.ఎస్.జగన్ పార్ట్-2 విడుదలయ్యాక అయినా అసలు విషయం బోధపడుతుందో లేదో.
– శ్యాం సుందర్, టెక్సాస్