ఘోస్ట్ ప్రీ రిలీజ్ వేదిక మీద హీరో నాగార్జున మెగాస్టర్ గాడ్ ఫాదర్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఘోస్ట్…గాడ్ ఫాదర్ ఒకే రోజు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తన సినిమాతో పాటు గాడ్ ఫాదర్ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా అన్నారు నాగ్. అంత వరకు బాగానే వుంది.
కానీ అదే రోజు స్వాతిముత్యం అనే చిన్న సినిమా కూడా విడుదలవుతోంది. నిర్మాత బెల్లంకొండ చిన్న కొడుకు గణేష్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా. వర్ష బొల్లమ్మ హీరోయిన్. మరి ఈ సినిమాకు కూడా విసెష్ అందచేయాలి, ఆల్ ది బెస్ట్ చెప్పాలిగా?
ఇండస్ట్రీ జనాలు పైకి మాత్రం చిన్న సినిమాల రావాలి. తీయాలి. బతకాలి అంటూ వుంటారు. కానీ వాటి గురించి మాత్రం పట్టించుకోరు. నిజానికి నాగ్ గాడ్ ఫాదర్ సినిమా గురించి ప్రస్తావించకపోయినా ఆ సినిమాకు మైనస్ ఏమీ వుండదు. కానీ అదే స్వాతిముత్యం సినిమా గురించి ప్రస్తావిస్తే అది దానికి ప్లస్ అవుతుంది. ఈ చిన్న లాజిక్ తెలిస్తే నాగ్ మరచిపోకుండా విష్ చేసి వుండేవారేమో?
ఇదిలా వుంటే కర్నూలు ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత హైదరాబాద్ లో కూడా ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. బహుశా ఈ ఈవెంట్ ఓపెన్ గా, భారీగా కాకుండా జస్ట్ ఏదైనా హోటల్ లో లేదా ఫంక్షన్ హాల్ లో జరిగే అవకాశం వుంది. అప్పుడైనా నాగ్ చిన్న సినిమాలకు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతారమో చూడాలి.