రాజధాని కావాలి…బల్లగుద్ది మరీ చెబుతున్న మాట

విశాఖ సిటీ పొటెన్షియాలిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. విశాఖ సహజసిద్ధంగా ఏర్పడిన నగరం. తనకు తానుగా దిద్దుకుంటూ మెల్లగా అభివృద్ధి చెందిన సిటీ. అలాంటి విశాఖ పేరులోనే రాజసం ఉంది. విశాఖను…

విశాఖ సిటీ పొటెన్షియాలిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. విశాఖ సహజసిద్ధంగా ఏర్పడిన నగరం. తనకు తానుగా దిద్దుకుంటూ మెల్లగా అభివృద్ధి చెందిన సిటీ. అలాంటి విశాఖ పేరులోనే రాజసం ఉంది. విశాఖను రాజధాని చేస్తే ఆ ఠీవీ మరింతగా పెరుగుతుంది.

ఈ విషయంలో రెండవ మాట లేదు. విశాఖ వంటి రెడీ మేడ్ సిటీ కళ్ల ముందు ఉంచుకుని తక్షణ దాహం తీర్చుకోవడానికి ఏళ్ళూ పూళ్ళూ టైమ్ పట్టేలా  బావి తవ్వడం అన్నట్లుగా కొత్త రాజధాని పేరిట నిర్మాణం చేస్తున్నారు అన్నది మేధావుల భావన. విశాఖ నంబర్ వన్ సిటీ. రాజధానికి అన్ని రకాలుగా అర్హత కలిగిన నగరం విశాఖ మాత్రమే.

ఇది విశాఖలోని మేధావులు ముక్తకంఠంతో అంటున్న మారు. మాజీ వైస్ చాన్సలర్లు, ప్రొఫెసర్లు, చదువురులు అంతా ఒక్కటిగా చేరి విశాఖ మన రాజధాని కావాలని నినదించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో తాజాగా జరిగిన రౌండ్ టేబిల్ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరైన మేధావులు అంతా విశాఖను రాజధాని చేసి తీరాలని కోరుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామక్రిష్ణన్ కమిటీ అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దే వద్దు అని చెప్పిందని మాజీ వీసీ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గుర్తు చేశారు. ఆ కమిటీని పక్కన పెట్టి నాటి టీడీపీ ప్రభుత్వం నారాయణ కమిటీ అంటూ తమ వారితో వేసి అమరావతిని ముందుకు తెచ్చారని పేర్కొన్నారు.

విశాఖలో రోడ్ రైల్, ఎయిర్ పోర్ట్, రోడ్ కనెక్టివిటీ ఉందని, ఇంతటి మహా నగరం ఏపీలో మరోటి ఉందా అని మేధావులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. విశాఖను పాలనా రాజధానిగా చేసుకుంటే విద్యా ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయని, పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొన్నారు.

విశాఖ కూడా హైదరాబాద్ తో సరిసమానంగా రాణించడం ఖాయమని ఏపీ ఆర్ధిక అభివృద్ధికి చోదకశక్తిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కర్నూల్ కి హై కోర్టుని తరలించి విశాఖను రాజధానిగా చేస్తే ఏపీ మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధితో వర్ధిల్లుతుందని మేధావులు గట్టిగా నొక్కి వక్కాణిస్తున్న మాట. మరి విశాఖకు ఎవరి మద్దతు లేదని, అది రాజధాని కానే కాదని మాట్లాడుతున్న వారికి ఈ సదస్సు ఒక చెంప పెట్టు అన్నది నిజం.