రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల మేకింగ్ వ్యవహారంలో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న నటి షెర్లిన్ చోప్రా స్టేట్ మెంట్ లో తనకేం తెలియనదని చెప్పుకుందని వార్తలు వస్తున్నాయి. అవి పోర్న్ ఫిల్మ్ లు అవుతాయనే విషయం తనకు తెలియదని, తను కేవలం రాజ్ కుంద్రా ఏం చెబితే అది చేసినట్టుగా షెర్లిన్ చెప్పుకుందట. అంతేగాక ఈ విషయంలో తనను రాజ్ చాలా ప్రోత్సహించాడని, అతడు చెప్పినట్టుగానే తను చేసినట్టుగా , అంతకు మించి తన ప్రమేయం లేదని చెప్పుకుందట షెర్లిన్.
తను నటించిన వీడియోల గురించి కుంద్రా తనకు రకరకాల విషయాలు చెప్పాడని షెర్లిన్ పోలీసులకు వివరించిందట. ఆ వీడియోలను తన భార్య శిల్పా షెట్టి చూసినట్టుగా షెర్లిన్ తో చెప్పేవాడట కుంద్రా. ఆ వీడియోల్లో తను బాగా చేసినట్టుగా శిల్ప తనను ప్రశంసించినట్టుగా కుంద్రా అనేవాడని షెర్లిన్ పోలీసులకు వివరించిందట. మొత్తానికి ఈ రకంగా శిల్ప నుకూడా ఈ వ్యవహరంలోకి లాగేసింది షెర్లిన్.
ఇప్పటి వరకూ ఈ పోర్న్ రాకెట్ తో శిల్పకు ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులకు ఎలాంటి ఆధారాలూ దొరకలేదని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే పోలీసులు శిల్పను ఒకసారి విచారించారు కూడా. ఆ సందర్భంగా తన భర్త రూపొందించినవి పోర్న్ సినిమాలు కాదని, అవి సెమీ పోర్న్- సాఫ్ట్ పోర్న్ తరహావి, రొమాంటిక్ వీడియోలన్నట్టుగా శిల్ప చెప్పిందట. అయితే ఆ వీడియోలను స్వాధీనం చేసుకుని విచారించిన పోలీసులు మాత్రం అవి పోర్న్ అని అంటున్నారు.
అందులో నటించిన వారిని కూడా విచారిస్తున్నారు. అందులో భాగంగా షెర్లిన్ చోప్రాను విచారించగా.. తను అమాయకురాలిని అని అమె చెప్పిందట. కుంద్రా ఏం చెబితే అది చేసినట్టుగా ఆమె చెప్పిందట. అయితే షెర్లిన్ స్టేట్ మెంట్ గురించి వస్తున్న వార్తలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె వయసుకూ, ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ కూ సంబంధం లేనట్టుగా ఉందని నెటిజన్లు అంటున్నారు.
కుంద్రా చెప్పిందల్లా చేసి, పోర్న్ సినిమాల్లో నటించడానికి షెర్లిన్ ఏమీ అమాయకురాలు కాదు కదా, డబ్బు కోసమే ఆమె అలాంటి సినిమాల్లో నటించి, ఇప్పుడు తనకేం తెలియదన్నట్టుగా మాట్లాడం విడ్డూరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.