ఆంధ్రలో ఏం జరుగుతోంది?

ఆంధ్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? వైకాపా మంత్రులు ఒక్కసారిగా భాజపా మీద ఎందుకు నిప్పులు చెరగడం ప్రారంభించారు? భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును మారుస్తారంటూ రూమర్లు ఎవరు పుట్టిస్తున్నారు?  Advertisement ఆయనలో చురుకు…

ఆంధ్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? వైకాపా మంత్రులు ఒక్కసారిగా భాజపా మీద ఎందుకు నిప్పులు చెరగడం ప్రారంభించారు? భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును మారుస్తారంటూ రూమర్లు ఎవరు పుట్టిస్తున్నారు? 

ఆయనలో చురుకు పుట్టించడానికి ఈ రూమర్లు బయల్దేరాయా? లేక నిజంగానే కన్నా లక్ష్మీనారాయణకు మళ్లీ పగ్గాలు అందిస్తారా?  కేంద్రంలో ప్రశాంత్ కిషోర్ అనేక రాజకీయ స్ట్రాటజీలు నిర్మిస్తున్నారు. అవేమైనా ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయా?

జగన్ కు తెలియకుండా, ఆయన మనోభీష్టం తెలియకుండానే మంత్రులు భాజపా మీద విరుచుకుపడతారు అని అనుకోవడానికి లేదు. మరి ఇలా విరుచుకుపడుతున్నారు అంటే పర్యవసానాలకు జగన్ సిద్దమయ్యారనే అనుకోవాలి. 

రఘురామ కృష్ణంరాజు విషయంలో భాజపా వైఖరి జగన్ కు అస్సలు రుచించడం లేదు. అందుకే ఈ టర్న్ తీసుకున్నారా అన్నది అనుమానం. 

కానీ నిజంగా భాజపాతో ఇప్పుడు కయ్యం పెట్టుకోవాలని జగన్ అనుకుంటే అది మొండితనానికి పరాకాష్ట అవుతుంది. ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. ఎందుకంటే భాజపాలో ఇప్పుడు వున్నది సైద్దాంతిక పోరాటం సాగించే బ్యాచ్ కాదు. 

దండోపాయాలు ప్రయోగించి తమకు కావాల్సింది సాధించుకునే బృందం. అందువల్ల జగన్ గతంలో సోనియా మీదకు మొండిగా వెళ్లినట్లు వెళ్లిపోతారా? లేకా ఆచి తూచి అడుగేస్తారా?  అన్నది చూడాల్సి వుంది.