రెండు సినిమాలు..ఎన్నో ఆశలు

ఈవారం మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిల్లో రెండు సినిమాల ఫలితం మాత్రం ఆసక్తికరం. ఎందుకంటే ఇద్దరు హీరోలకు ఈ సినిమాలు చాలా కీలకం. హీరో శ్రీవిష్ణు..హీరో నాగశౌర్య లు నటించిన ఈ సినిమాలు వాళ్ల…

ఈవారం మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిల్లో రెండు సినిమాల ఫలితం మాత్రం ఆసక్తికరం. ఎందుకంటే ఇద్దరు హీరోలకు ఈ సినిమాలు చాలా కీలకం. హీరో శ్రీవిష్ణు..హీరో నాగశౌర్య లు నటించిన ఈ సినిమాలు వాళ్ల వాళ్ల కెరీర్ కు అవసరం అని అంటే సరిపోదు. చాలా చాలా అవసరం అనాల్సిందే. 

ఎన్ని వైవిధ్యమైన సినిమాలు చేసినా, సరైన బ్లాక్ బస్టర్ పడడం లేదు శ్రీవిష్ణు కు. ఛలో, అశ్వధ్దామ తరువాత ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్నాడు నాగశౌర్య. టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి అంతగా బాగాలేదు. థియేటర్లకు జనాలు రావడం అరుదుగా వుంది. 

ఇలాంటి టైమ్ లో అల్లూరి..కృష్ణ వృంద విహారి సినిమాలు వస్తున్నాయి. అల్లూరి సినిమాను శ్రీవిష్ణు ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్ తీసుకుని అల్లూరి సినిమా చేసారు. శౌర్య లవ్..రొమాంటిక్..ఎమోషనల్ సబ్జెక్ట్ తీసుకుని కృష్ణ..వృింద..విహారి సినిమా చేసారు.

రెండింటిలోనూ ఎమోషన్ అన్నది కీలకం. ఈ ఎమోషన్లను ఆయా సినిమాల డైరక్టర్లు ఏ మేరకు పండించారు అన్న దాన్ని బట్టి సినిమాల సక్సెస్ ఆధారపడి వుంటుంది. అల్లూరి సినిమాకు ప్రదీప్ వర్మ అనే కొత్త దర్శకుడు పని చేసారు. శౌర్య సినిమాకు రెండు మూడు సినిమాల అనుభవం వున్న అనీష్ కృష్ణ పని చేస్తున్నారు. అనీష్ కృష్ణ ఫన్ బాగానే పండిస్తారు. మరి ఎమోషన్ సీన్లు ఎలా డీల్ చేసారన్నది చూడాలి.

శ్రీ విష్ణు సాఫ్ట్ క్యారెక్టర్లు బాగా చేస్తారు. మరి ఈసారి ఫోర్స్, ఎమోషన్ టచ్ వున్న పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. అది ఎలా చేసారు అన్నది కీలకం. రెండు సినిమాల్లో చూసుకుంటే కృష్ణ..వృింద సినిమాలో మూడు పాటలు హిట్ అయ్యాయి. అల్లూరి పాటలు అంతగా రీచ్ కాలేదు. ఆ జానర్ అలాంటిది. రెండు సినిమాలు కూడా మౌత్ టాక్ తరువాతనే థియేటర్లలో వుండేదీ లేనిదీ తేలుతుంది. ముందుగా ఓపెనింగ్ ఎక్స్ పెక్ట్ చేసేంత సినిమాలు కావు.