అదే జరిగితే బన్నీకి పాన్-ఇండియా అప్పీల్ కష్టమే!

పుష్ప సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు అల్లు అర్జున్. ఎందుకంటే, బన్నీ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. 5 భాషల్లో ఈ సినిమాను ప్రమోట్ చేసి ఒకేసారి అన్ని భాషల్లో…

పుష్ప సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు అల్లు అర్జున్. ఎందుకంటే, బన్నీ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. 5 భాషల్లో ఈ సినిమాను ప్రమోట్ చేసి ఒకేసారి అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలనేది ప్లాన్. అయితే ఊహించని విధంగా పుష్పకు పోటీ ఎదురయ్యేలా ఉంది. అది కూడా పాన్-ఇండియా లెవెల్లో.

పుష్ప పార్ట్-1 ది రైజ్ ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. తెలుగులో ఆ టైమ్ కు పెద్ద సినిమాల రిలీజుల్లేవు. నాని నటించిన 'అంటే సుందరానికి' సినిమాను క్రిస్మస్ కు అనుకున్నారు కానీ ఆ ప్లాన్ వర్కవుట్ అవ్వదు. సో.. బన్నీ సోలోగా వస్తున్నాడు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో మాత్రం బన్నీకి కేజీఎఫ్-2 రూపంలో పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయంటున్నారు సినీ విశ్లేషకులు.

అవును.. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేజీఎఫ్ చాప్టర్-2ను క్రిస్మస్ కు విడుదల చేయాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోందని సమాచారం. అదే కనుక జరిగితే బన్నీకి గట్టి పోటీ తప్పదు.

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప సినిమాకు, కేజీఎఫ్ చాప్టర్-2కు పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఇక్కడ బన్నీ డామినేషన్ ఉంటుంది. కానీ ఉత్తరాది రాష్ట్రాలు, కన్నడ-తమిళ మార్కెట్లకు వచ్చేసరికి మాత్రం పుష్ప సినిమాకు కేజీఎఫ్-2 గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. నార్త్ లో కేజీఎఫ్ ఆల్రెడీ పెద్ద హిట్. దాని సీక్వెల్ కోసం అక్కడి జనాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ మీడియా కూడా ఈ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.

అలా భారీ అంచనాలతో వస్తున్న కేజీఎఫ్-2ను ఉత్తరాదిన పుష్ప సినిమా తట్టుకోవడం చాలా కష్టం. ఇటు కన్నడనాట, కోలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో.. క్రిస్మస్ బరిలో కేజీఎఫ్-2 నిలిస్తే, బన్నీకి పాన్ ఇండియా అప్పీల్ కష్టమే.