సాహో సెకండ్ సింగిల్ వస్తోంది

బాహుబలి ప్రభాస్ సాహో సినిమా అఫీషియల్ డేట్ వచ్చేసింది. మరో నెలరోజులు టైమ్ వుంది విడుదలకు. ఇప్పటికే టీజర్, ఒక సాంగ్ విడుదల చేసారు. మరో ఒకటి రెండురోజుల్లో రెండో పాటను విడుదల చేయడానికి…

బాహుబలి ప్రభాస్ సాహో సినిమా అఫీషియల్ డేట్ వచ్చేసింది. మరో నెలరోజులు టైమ్ వుంది విడుదలకు. ఇప్పటికే టీజర్, ఒక సాంగ్ విడుదల చేసారు. మరో ఒకటి రెండురోజుల్లో రెండో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేట్ పోస్ట్ పోన్ మెంట్ అనౌన్స్ మెంట్ ను మామూలుగా ప్రెస్ నోట్ రూపంలో ఇచ్చేసారు.

అందుకే ఓ మాంచి పోస్టర్ ను డిజైన్ చేయించి, దాన్నే డేట్ పోస్టర్ గా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ పోస్టర్ విడుదలతో పాటే రెండోసాంగ్ విడుదల అనౌన్స్ చేసి, ఆ వెంటనే పాటను విడుదల చేసే ప్లాన్ లో వుంది సాహో టీమ్.

అలాగే సాహో సినిమా క్యారెక్టర్లను పరిచయం చేసే పోస్టర్లను కూడా విడుదల చేసి ప్రచారాన్ని స్పీడప్ చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటివరకు సినిమా రిలీజ్ ప్లానింగ్, ఫినిషింగ్ వర్క్ ల మీద దృష్టిపెట్టిన సాహో టీమ్ ఇప్పుడు ప్రచారంపై దృష్టి పెడుతోంది. మరో రెండు రోజుల నుంచి సాహో తరచు వార్తల్లో వుండేలా ప్లాన్ చేస్తున్నారు.

జగన్‌ ఐఏఎస్‌ మీటింగులో 'రిసీట్‌' అనే బదులు 'రిసీప్ట్‌' అన్నాడు..