కాస్సేపు నిజాలు మాట్లాడుకుందాం… గాడ్ ఫాదర్ సినిమా కోసం థమన్ అందించిన ట్యూన్ తో వచ్చిన పాట, దాంతో పాటు రూపొందించిన వీడియో ఎలా వున్నాయి? సల్మన్..మెగాస్టార్ రేంజ్ కు వున్నాయా? అంటే వెంటనే అవును అనే సమాధానం రాదు.
ఎందుకంటే మెగాస్టార్ పాటలు, డ్యాన్స్ లు ఎన్ని చూడలేదు..వాటి లెవెల్ ఓ రేంజ్ లో వుంటుంది. ఖైదీ నెంబర్ 150 పాటలు ఎలా వుంటాయి. కాస్త కిట్టింపుగా వున్నా డ్యాన్స్ లు ఎలా వుంటాయి.
కానీ జోష్, ఆ స్పీడ్ అస్సలు కనిపించలేదు గాడ్ ఫాదర్ సినిమా నుంచి వచ్చిన తార్ మార్ టక్కర్ మార్ పాటలో. మూడు నాలుగు రోజులుగా ఊరిస్తూ వదిలిన ఈ వీడియో సాంగ్ లో డ్యాన్స్ డైరక్టర్ ప్రభుదేవా, డ్యాన్సర్లు ఇచ్చిన మూవ్ మెంట్ లే తప్ప హీరోలు ఇద్దరి మూవ్ మెంట్ లు అస్సలు కనిపించలేదు. ఎంతసేపూ చేతలు కదపడం తప్ప కాలు కదపడం కనిపించ లేదు.
పాట ట్యూన్ అస్సలు క్యాచీ గా లేదు. పాటలా కాకుండా పాఠం చదువుతున్నట్లు సాగింది. అనంత్ శ్రీరామ్ తప్పు లేదు. ఇచ్చిన ట్యూన్ కు ఆయన బాగానే రాసాడు. కానీ థమన్ ట్యూన్ నే అలా వుంది. చిరంజీవి..సల్మాన్ లాంటి ఇద్దరు హీరోలకు ఓ పాట ఇవ్వాల్సి వస్తే అది ఏ రేంజ్ లో వుండాలి, వాళ్ల ఫ్యాన్స్ అంచనాలు ఎలా వుంటాయి అన్నది అస్సలు ఆలోచించినట్లు లేదు. అలా ఆలోచించి వుంటే ఇలాంటి ట్యూన్ రాదు కదా?