సందీప్ కిషన్ నిర్మాతగా కమెడియన్ సత్య కీలకపాత్రలో నటించిన సినిమా వివాహ భోజనంబు. ఈ సినిమా సోనీ లివ్ ఓటిటి ప్లాట్ ఫారమ్ మీద విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలో ఓ ట్రయిలర్ ను కట్ చేసి వదిలారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ట్రయిలర్ ను కట్ చేసారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో దొర్లిన ఫన్ ను సినిమాకు బాగానే వాడుకున్నారు.
తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి కొడుక్కి లాక్ డౌన్ పిడుగుపాటులా మీద పడితే… పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే 21 రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తే.. ఇదీ కాన్సెప్ట్ గా ట్రయిలర్ చెబుతోంది.
ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు దర్శకుడు రామ్ అబ్బరాజు. నూతన తార అర్జావీ రాజ్ నాయికగా నటించింది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సందీప్ కిషన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశషం.
తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా లాంఛ్ అవుతున్న 'సోని లివ్' ..తన తొలి చిత్రంగా “వివాహ భోజనంబు” ను స్ట్రీమింగ్ చేయబోతోంది. స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్ఆర్, వైవా హర్ష, శివన్నారాయణ, మధు మణి, నిత్య శ్రీ, కిరీటి, దయ, కల్ప లత తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.