విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఏం చేసినా వినూత్నమే. ‘మా’ అధ్యక్ష బరిలో నిలుస్తానని ఆయన ప్రకటించడంతో ‘స్థానికత’ అంశం తెరపైకి వచ్చింది. ఇదే ప్రకాశ్‌రాజ్‌కు తమిళనాడు చిత్రపరిశ్రమకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా? అక్కడి వాళ్లు ఆహ్వానిస్తారా? అనే ప్రశ్నలు టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ఒక వర్గం నుంచి వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలను ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్నప్పుడు, ఆయన స్థానికేతరుడని, ఎలా చేస్తారని ఎందుకు ప్రశ్నించలేదని ప్రకాశ్‌రాజ్ మద్దతుదారులు దీటుగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
‘మా’ ఎన్నికలు ఎప్పుడనే విషయం ఇంకా స్పష్టత రాకపోయినా, టాలీవుడ్‌లో హాట్‌హాట్ చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఐదు గురు బరిలో నిలుస్తామని ప్రకటించారు. ప్రధానంగా ‘మా’ ఎన్నికలపై విలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు, యువ హీరో మంచు విష్ణు తరచూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అధ్యక్ష బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఒక దశలో ఆయన కొందరికి ఘాటు హెచ్చరికలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ప్రకాశ్‌రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘తెగేదాకా లాక్కండి’ అని తెలుగులో సుతిమెత్తని హెచ్చరిక చేయడం విశేషం. దీనికి జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేశారాయన. ప్రకాశ్‌రాజ్ తాను ప్రశ్నిస్తున్నట్టు చెప్పుకున్నారే గానీ, ఆయన చేసింది హెచ్చరికే అనే వాళ్లు లేకపోలేదు.
ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన ఎవరిని? ఎందుకు ప్రశ్నిస్తున్నారనే విషయమై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఎలా తెగుతుంది…ఎవరు లాగుతున్నారు?, తెగితే వారే పడతారు, ఇంతకూ మీ బాధ ఏంటి? తదితర కామెంట్స్ ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌పై వెల్లువెత్తాయి. ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌కు నేపథ్యం తెలిస్తే… మరింత రాజకీయ వేడి పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.