జ‌గ‌న్ స‌ర్కార్‌కు జ‌న‌సేనాని ట్విట్ట‌ర్ క్లాస్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ స‌ర్కార్‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్లాస్ పీకాడు. అది ట్విట‌ర్ వేదిక‌గా. టీటీడీ ఆస్తుల అమ్మ‌కాల‌పై ప‌వ‌న్ త‌న‌దైన స్టైల్‌లో ట్విట‌ర్‌లో స్పందించారు. శ్రీ‌వారి భూములు అమ్మాల‌న్న టీటీడీ నిర్ణ‌యం స‌రైంది…

ఏపీ సీఎం జ‌గ‌న్ స‌ర్కార్‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్లాస్ పీకాడు. అది ట్విట‌ర్ వేదిక‌గా. టీటీడీ ఆస్తుల అమ్మ‌కాల‌పై ప‌వ‌న్ త‌న‌దైన స్టైల్‌లో ట్విట‌ర్‌లో స్పందించారు. శ్రీ‌వారి భూములు అమ్మాల‌న్న టీటీడీ నిర్ణ‌యం స‌రైంది కాద‌న్నారు.  టీటీడీ ఆస్తులను అమ్మే అవసరం ఏం వ‌చ్చిందో చెప్పకుండా నిర్ణయం చేయడం‌ తగదన్నారు.

తమిళనాడులోని ఆస్తుల అమ్మకంపై ప్రభుత్వం, టీటీడీ బోర్డు ప్రజలకు వివరణ ఇవ్వాలని ప‌వ‌న్ డిమాండ్ చేశారు. టీటీడీ భూము లను లీజుకు ఇవ్వడం లేదా వ్యాపారాల కోసం అభివృద్ధి చేయాలని సూచించారు. యాజమాన్య హక్కులను కోల్పోకుండా ఆర్జ‌న‌పై ఎందుకు దృష్టి పెట్టరని ప్రశ్నించారు. విలువను సృష్టించడానికి భూమి ఉపయోగ‌ప‌డుతుంద‌న్నారు.

ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా భూమిని రక్షించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించాలని సూచించారు. భక్తుల మనోభావాలను, నమ్మకాన్ని దెబ్బతీయడం సరి కాదని హితవు పలికారు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఆర్థిక అవకాశాలను పణంగా పెట్టడం చేటు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులలో టీటీడీ భూములను అమ్మేందుకు అనుమతిస్తే అది చాలా పెద్ద తప్పని ఆయ‌న‌ హెచ్చరించారు.

ప‌వ‌న్ ట్వీట్ చ‌దివితే ఆయ‌న సోష‌ల్ మీడియా వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ గురించి ఏ మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. అందులోనూ బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన ప‌వ‌న్‌, ఆ పార్టీతో క‌లిసి ఏదైనా చేస్తామ‌ని కూడా పేర్కొన‌లేదు.

ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు