దేశంలో కరోనా మృతుల సంఖ్య 4వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 154 మంది మృతిచెందారు. దీంతో భారత్ లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4021కు పెరిగింది. అటు నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 6977 (ఇప్పటికి ఇదే హయ్యస్ట్) కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 138,845కు చేరుకుంది.
నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 3280 మంది డిశ్చార్జ్ కాగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 57,721కు చేరుకుంది. ప్రస్తుతం 77వేల మందికి వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. మహారాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 3041 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50వేలు దాటింది. 1635 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు 14,600 మంది కోలుకున్నారు.
అటు తమిళనాడులో కూడా కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉంది. గడిచిన 24 గంటల్లో 765 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 16,277కు చేరుకుంది. కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే.. తమిళనాట కోలుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్నటివరకు మొత్తంగా 8324 మంది డిశ్చార్జ్ అయ్యారు. 111 మంది మరణించారు.
గడిచిన 24 గంటల్లో గుజరాత్ లో 392, ఢిల్లీలో 508, రాజస్థానంలో 286, మధ్యప్రదేశ్ లో 294 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తమిళనాడు (16,277) రెండో స్థానంలో, గుజరాత్ (14,056) మూడో స్థానంలో, ఢిల్లీ (13,418) నాలుగో స్థానంలో ఉన్నాయి.
ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు