పచ్చ రాజకీయం పండించడానికేనా?

విశాఖలో ఒక దుర్ఘటన జరిగింది. అమాయకులు కొంతమంది చనిపోయారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించింది. వెంటనే తగిన చర్యలు తీసుకుంది. దాంతో అతి పెద్ద ముప్పు విశాఖకు తప్పింది. ఇక బాధితులందరికీ…

విశాఖలో ఒక దుర్ఘటన జరిగింది. అమాయకులు కొంతమంది చనిపోయారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించింది. వెంటనే తగిన చర్యలు తీసుకుంది. దాంతో అతి పెద్ద ముప్పు విశాఖకు తప్పింది. ఇక బాధితులందరికీ భారీ నష్టపరిహారం చెల్లించి న్యాయం చేసింది. ఇపుడు విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత ప్రాంతాలలో సాధరణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

వైసీపీ సర్కార్ స్పందించిన తీరుని ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేవే మెచ్చుకున్న తరువాత ఇపుడు చంద్ర బాబు కొత్తగా అక్కడకు వెళ్ళి బురద రాజకీయం చేయాలన్న ఉబలాటం ఎందుకో మరి అర్ధం కాదని వైసీపీ నేతలు అంటున్నారు.

ఘటన జరిగి మూడు వారాలు అవుతోంది. ఇపుడా పరామర్శలు బాబూ అంటూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ  అమరనాధ్ బాగానే వెటకారమాడుతున్నారు.  విశాఖ ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది, మళ్ళీ గ్యాస్ మండించి నీచ రాజకీయాలు తెర తీయవద్దు అని వేడుకుంటున్నారు. అయినా పరామర్శకు కూడా సమయం, సందర్భాలు లేవా అని ఆయన నిలదీస్తున్నారు.

ఘటన జరిగిన వెంటనే ఏపీ పోలీసుల అనుమతి తీసుకుని వస్తే బాగుండేది కదా. నాడు కేంద్రానికి లేఖ రాసి ప్రత్యేక అనుమతులు  ఇవ్వలేదన్న సాకుతో బాబు జనాలను మభ్యపెట్టారని గుడివాడ మండిపడ్డారు. ఇపుడు తాపీగా రాజకీయం చేయడానికి టైం, డేట్ ఫిక్స్ చేసుకుని వస్తున్నారా అని బాగానే తగులుకున్నారు.

అసలు ఇంతకీ విశాఖకు ఎందుకు వస్తున్నారు బాబూ అని గుడివాడ అమాయకంగానే అడుగుతున్నారు. ఒక్క గుడివాడకే కాదు ఈ డౌట్ చాలామందికే ఉంది. ఇంతకీ అంతా అయిపోయాక బాబు నింపాదిగా విశాఖ ఎందుకు రావాలనుకుంటున్నట్లు. ముందే చెప్పుకున్నట్లుగా పచ్చ రాజకీయం పండించడానికేనా.  

ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు