తమ మధ్య ఉన్న పోటీ గురించి కూడా చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే. ఇది వరకూ తమ ప్రేమబంధం లోని బలాలు-బలహీనతల గురించి పలుసార్లు ఓపెనప్ అయ్యారు. తమ మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో కూడా వివరించి చెప్పినంత పని చేశారు! ఇద్దరూ స్టార్ లు అయినప్పుడు, అందునా భర్త కన్నా భార్య సంపాదన-క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు అనేక సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి వాటన్నింటినీ సునాయాసంగా జయించుకుంటూ వీరు కాపురం చేస్తున్నట్టే!
ఇలాంటి క్రమంలో మరో సరదా అంశం గురించి వివరించాడు రణ్ వీర్ సింగ్. తనకూ, తన భార్యకు మధ్య పోటీ సినిమాల విషయంలోనే గాక బ్యాడ్మింటన్ విషయంలోనూ ఉంటుందని రణ్ వీర్ చెప్పాడు. తనది అథ్లెటిక్ బాడీ అని, తను కూడా మంచి అథ్లెట్ నేనంటూ రణ్ వీర్ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ తను బ్యాడ్మింటన్ మ్యాచ్ లో తన భార్యపై నెగ్గలేకపోతున్నట్టుగా చెప్పాడు.
దీపికకు బ్యాడ్మింటన్ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ప్రకాష్ పదుకునే ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఛాంపియన్ కూడా. దేశంలో ఒకప్పుడు స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్. దీంతో ఆయన కూతుళ్లకు కూడా బ్యాడ్మింటన్ అలవాటు ఉండటంలో ఆశ్చర్యం లేదు. దీపిక చెల్లెలు పలు టోర్నీల్లో కూడా ఆడినట్టుగా ఉంది. దీపిక మాత్రం నటిగా సెటిలయిపోయింది. అయినప్పటికీ దీపికా పదుకునేకు బ్యాడ్మింటన్ పై బ్రహ్మాండమైన గ్రిప్ ఉందట, ఎంతలా అంటే.. ఎప్పుడైనా తనను ఆమె చిత్తుగా ఓడిస్తుందని రణ్ వీర్ చెప్పాడు.
ప్రతి మ్యాచ్ నూ సీరియస్ గా తీసుకుంటుందని, ప్రతి పాయింట్ విషయంలోనూ కష్టపడి తనను ఓడించేస్తుందని రణ్ వీర్ చెప్పాడు. దీపికతో పోటీ పడి తను ఇప్పటి వరకూ ఒక్క సెట్లో కూడా 10 పాయింట్లను కూడా చేయలేకపోయినట్టుగా రణ్ వీర్ చెప్పాడు. ఏనాటికైనా తను కనీసం 10 పాయింట్లను సాధించి, ఒక సెట్ లో అయినా తన సత్తా చూపుతానంటూ రణ్ వీర్ చెప్పుకొచ్చాడు. బ్యాడ్మింటన్ విషయంలో దీపిక తన మీద మరీ రూత్ లెస్ గా రెచ్చిపోతుందని రణ్ వీర్ వ్యాఖ్యానించాడు!
ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు