అమరావతికి 50 వేల కోట్ల ఖర్చు

అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లకు పైగా ఖర్చు అవుతుందని, ఏటా అయిదు వేల కోట్ల వంతున పెట్టుకుంటూ వెళ్లినా దశాబ్దాలు పడుతుందని ఆంధ్ర సిఎమ్ జగన్ అసెంబ్లీలో చెప్పారు.  Advertisement అబ్బే అంత…

అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లకు పైగా ఖర్చు అవుతుందని, ఏటా అయిదు వేల కోట్ల వంతున పెట్టుకుంటూ వెళ్లినా దశాబ్దాలు పడుతుందని ఆంధ్ర సిఎమ్ జగన్ అసెంబ్లీలో చెప్పారు. 

అబ్బే అంత అవసరం లేదు 50 వేల కోట్లు చాలు అంటోంది ఈనాడు పత్రిక. మిగిలిన యాభై వేల కోట్లలో అధికభాగం వివిధ సంస్థలు భరిస్తాయంటోంది. మిగిలిన 50 వేల కోట్లలో అధికభాగం అంటే ముఫై కోట్లు అనుకుందాం. అంటే ఆ పైన వున్న ఇరవై వేల కోట్లు కూడా ప్రభుత్వమే పెట్టాలి కదా? అంటే వెరసి 70 వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతి రాజధాని రెడీ అవుతుందన్నమాట.

అంటే జగన్ అసెంబ్లీలో చెప్పింది దాదాపు నిజమే కదా? అయితే ఈనాడు ఇంకో ముచ్చట చెబుతోంది. రాజధానికి రైతులు ఇచ్చిన భూములు భవిష్యత్ లో మంచి రేటు పలుకుతాయి కనుక, అలాగే వివిధ సంస్థలకు విక్రయిస్తారు కనుక బోలెడు కోట్లు వస్తాయని, అవన్నీ లెక్కలోకి తీసుకుంటే అమరావతి కట్టడం పెద్ద కష్టం కాదంటోంది. 

ఇక్కడ చిన్న అనుమానం రైతుల దగ్గర తక్కువకు తీసుకుని, డెవలప్ చేసి అమ్ముకుని డబ్బులు సంపాదించడం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుందా? లేక రాజధాని నిర్మాణం అవుతుందా?

సరే ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా జనాల సొమ్ములతో లేదా భూములతో వ్యాపారం చేయడం అద్భుతమైన ఐడియా అనుకుందాం. అలా చేయాలన్నా కూడా ఏటా అయిదు వేల కోట్లు వెచ్చిస్తే ఏమూలకు? మిగిలిన వేల కోట్లకు ఏటేటా ఖర్చు పెరుగుతూ వుంటుంది కానీ తగ్గదు కదా? 

అమరావతిని ఏ విధంగా సమర్థించాలి అని తెలుగుదేశం అనుకూల మీడియా అనుకున్నా, నిర్మాణ వ్యయం ప్రకారం చూసుంటే దశాబ్దాల కాలం పడుతుంది…వేలాది కోట్లు ఖర్చు అవుతుంది అన్నది మాత్రం అసత్యం అయితే కాదు కదా?