వీధిలోంచి దోమ కూడా పోకూడదు..రాకూడదు..పెరట్లోంచి మాత్రం ఏనుగులు తిరిగేయచ్చు అని వెనకటికి సామెత. మన దేశంలో ప్రభుత్వ సెన్సారు వ్యవహారాలు ఇలాగే వుంటాయి. సినిమాలు అనేసరికి సవాలక్ష మ్యూట్ లు, కట్ లు. నిబంధనలు. నిజమే..అవసరమే..వుండాల్సిందే..కానీ మరి ఆన్ లైన్ మాధ్యమం సంగతేమిటి? యూ ట్యూబ్ లో కావాల్సినంత పోర్నో చిందులు తొక్కుతోంది. పోనీ అదెంటీ అధెంటిసిటీ, గుర్తింపు లేని వాళ్లు చేసే పని అని సరిపెట్టుకోవచ్చు.
ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ల్లో వెబ్ సిరీస్ ల్లో భావ స్వేచ్ఛపేరిట కావాల్సినంత విచ్చలివిడితనం కనిపిస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా ఇది మరీ కొత్త పుంతలు తొక్కింది. అమెజాన్ ప్రయిమ్ లో పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. చాలా బాగుంది. అన్ని విధాలా ప్రశంసలు అందుకుంటోంది. వెబ్ సిరీస్ విషయంలో వంక పెట్టడానికి లేదు. కొన్ని అడల్ట్ సీన్లు వున్నా అది వేరే సంగతి.
ఇంతకీ అభ్యంతరం ఎక్కడ అంటే, పాతాళ్ లోక్ సినిమాకు అందించిన తెలుగు సబ్ టైటిల్స్ గురించే. వివిధ భాషల ప్రేక్షకుల కోసం ఆయా భాషల్లో సబ్ టైటిల్స్ ను రాయించి అందించిది అమెజాన్ ప్రయిమ్ సంస్థ. ఆ రాసిన వాళ్లు ఎవరో, దానిని అమెజాన్ ప్రయిమ్ సంస్థ నిర్వాహకులు భాష తెలియక యాజ్ ఇట్ ఈజ్ గా ఓకే చేసారనుకోవాలి.
ఎందుకంటే తెలుగులో వున్న సర్వ బూతులు విచ్చలవిడిగా వాడేసారు. హిందీ అంతంత మాత్రంగా అర్థం అయ్యేవారు., తెలుగు సబ్ టైటిల్స్ వున్నాయి కదా అని ఆ ఆప్షన్ ను ఎంచుకున్నారో బుక్ అయిపోయినట్లే. ఆ బూతులు చదువుకుంటూ వెళ్లడంతోనే సరిపోతుంది. పొరపాటున కుటుంబసభ్యులతో వీక్షించాలని టీవీకి కనెక్ట్ చేసి, తెలుగు సబ్ టైటిల్స్ పెట్టారో, వారి ముందు తల దించుకోవాల్సిందే. అంత నీచమైన భాష వాడేసారు.అమెచ్యూర్ అన్న పదం వచ్చిన చోట కూడా తెలుగులో బూతు పదాలు వాడారు అంటే కావాలని వాడారా? అన్న అనుమానం కలుగుతోంది
మరి ఇలాంటి విషయాలు ఎన్నో వుంటే, ప్రభుత్వం మాత్రం సినిమాలు, సెన్సారు అంటూ వుంటుంది. ఈ ఓటిటి వెబ్ సిరీస్ లకు ఎప్పుడు సెన్సారు వస్తుందో?
ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు