కొరటాల శివ-మెగాస్టార్ కాంబినేషన్ లో తయారైన ఆచార్య కు విడుదల డేట్ సమస్య పరిష్కారం అయినట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదలవుతుంది.
క్రిస్మస్, సంక్రాంతి బరిలో చాలా సినిమాలు వున్నాయి. మరి ఆచార్య పరిస్థితి ఏమిటి అన్న పాయింట్ బలంగా వినిపించింది. అయితే ఆర్ఆర్ఆర్ కు రెండు వారాలు ముందుగా దసరా సీజన్ లోనే ఆచార్యను విడుదల చేసే అవకాశం వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
అక్టోబర్ ఫస్ట్ న కానీ, లేదా సెప్టెంబర్ 30న కానీ ఆచార్యను విడుదల చేస్తే రెండు వారాలు సోలోగా థియేటర్లలో వుండొచ్చు. పైగా అది కూడా దసరా సీజన్ నే. సెప్టెంబర్ 30 న వేస్తే వరుసగా నాలుగు రోజుల పాటు అదనపు షోలు వేసుకునే అవకాశం వుంటుంది.
రెండు వారాల తరువాత ఆర్ఆర్ఆర్ వచ్చినా నూరు శాతం థియేటర్లలో విడుదల కాదు. ఎన్నో కొన్ని థియేటర్లు ఆచార్యకు కూడా వుంటాయి. అందువల్ల ఆ డేట్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఆచార్య యూనిట్ వున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఇప్పుడే విడుదల డేట్ ప్రకటించాలని ముందు అనుకున్నారు. కానీ పరిస్థితులు, ఆర్ఆర్ఆర్ వ్యవహారం చూసి డేట్ వేయాలనుకుంటున్నారు. సినిమాకు పెద్దగా వర్క్ బ్యాలన్స్ లేదు.
చరణ్ – పూజ ల మీద ఓ పాట చిత్రీకరించాలి. ఆర్ఆర్ఆర్ షూట్ నుంచి చరణ్ రాగానే ఇది పూర్తవుతుంది. దాంతో సినిమా మొత్తం సెప్టెంబర్ నెలఖరుకు విడుదలకు ఏ అడ్డంకి లేకుండా రెడీ అయిపోతుంది.