ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో కోలగట్ల వీరభద్రస్వామి ఉపసభాపతిగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
కోలగట్ల కంటే ముందు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి గత వారం తన పదవి రాజీనామా చేయడంతో డిప్యూటీ స్పీకర్ గా ఇవాళ కోలగట్ల వీరభద్ర స్వామిని ఎన్నుకున్నారు.
సీఎం జగన్ కోలగట్ల పదవిపై మాట్లాడుతూ.. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
కోలగట్ల వీరభద్రస్వామి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పూసపాటి అశోక్ గజపతి రాజు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.