రాష్ట్ర శాసనసభలో ఈ రోజు కొత్త డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ విపక్ష నేత అచ్చెన్నాయుడు కూడా ఆయనకు అభినందనలు తెలియచేశారు.
అచ్చెన్నాయుడు అయితే కాస్తా ముందుకెళ్ళి కొన్ని సలహాలు ఇచ్చారు. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి ఇక మీదట రాజకీయాల జోలికి పోమాకండి అని. అలాగే ఎడమ వైపు ఉన్న విపక్షం మీద కూడా ఒక చూపు వేయండని, ఎంతసేపూ కుడి వైపు ఉన్న అధికార పక్షం వైపే చూడవద్దు అని కోరుకున్నారు.
దీనికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల తన స్పీచ్ లో బదులిస్తూ అచ్చెన్న మీద బాగానే సెటైర్లు వేశారు. మీరు సభలో మీ సీట్లో కూర్చుని ఉంటే కచ్చితంగా ఎడమ వైపు చూస్తామని, మీరు అక్కడ ఉండేదే లేనపుడు ఎలా ఎడమ వైపు చూసేదని అచ్చెన్నకు గట్టిగా రిటార్ట్ ఇచ్చారు.
తాను డిప్యూటీ స్పీకర్ గా రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని అందులో ఏ డౌటూ అవసరం లేదన్ చెప్పిన కోలగట్ల ఈ సీటు దిగిపోగానే షరా మామూలుగా రాజకీయ నాయకుడిగానే ఉంటాను అని ఖరాఖండీగా చెప్పారు.
తనకు వైసీపీ సీటు ఇవ్వబట్టి తన ప్రాంతం ప్రజలు గెలిపించబట్టి ఈ సీట్లోకి వచ్చానని, అందువల్ల రాజకీయ నాయకుడిగా ఉండకపోతే ఎలా అంటూ అచ్చెన్నకు ఝలక్ ఇచ్చేశారు. అంతే కాదు డిప్యూటీ స్పీకర్ గా తన మొదటి యాక్షన్ గా టీడీపీ వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించి వారికి మరో షాక్ ఇచ్చారు.