లైగర్ తరువాత మళ్లీ ఇదే

లైగర్ సినిమా బడ్జెట్ తో, మార్కెట్ తో పోల్చుకోవడానికి లేదు కానీ, ఫ్లాపు విషయంలో మాత్రం దాని సరసన చేరిపోయింది ఇంద్రగంటి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. బడ్ఙెట్ వైజ్ గా చూసుకుంటే…

లైగర్ సినిమా బడ్జెట్ తో, మార్కెట్ తో పోల్చుకోవడానికి లేదు కానీ, ఫ్లాపు విషయంలో మాత్రం దాని సరసన చేరిపోయింది ఇంద్రగంటి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. బడ్ఙెట్ వైజ్ గా చూసుకుంటే దానికి దీనికి ఒకటి పదింతలు తేడా వుంది. కానీ మార్నింగ్ షో తోనే కలెక్షన్లు జారిపోయిన వైనం మాత్రం రెండూ ఒక్కటే. ఆ అమ్మాయి సినిమా పరిస్థితి మరీ దారుణం. కనీసం తొలి మూడు రోజులు కూడా డీసెంట్ కలెక్షన్లకు నోచుకోలేదు.

చాలా అంటే చాలా థియేటర్లలో కలెక్షన్లు నాలుగు అంకెలు దాటలేదు. సినిమాలో విషయం లేకపోవడం, నత్త నడక నడవడం, సరైన పాటలు లేకపోవడం ఇలా ఒకటి కాదు చాలా కారణాలు సినిమాను దెబ్బతీసాయి. ఈ సినిమాకు దాదాపు 12 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారు. మైత్రీ బ్యానర్ యాడ్ కావడంతో నాన్ థియేటర్ హక్కుల వరకు ఫరవాలేకపోయింది.

కానీ థియేటర్ హక్కులు సకాలంలో విక్రయించలేకపోయారు. తొలుత ఎక్కువ రేటు చెప్పారు. తరువాత అడ్వాన్స్ ల మీద విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో దాదాపు మూడు కోట్ల వరకు నిర్మాతలకు నష్టం తప్పదని అంచనా.

ఆ అమ్మాయి తో పాటు విడుదలైన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, శాకిని ఢాకిని కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిలయ్యాయి. శాకిని ఢాకిని ముందుగానే మాంచి రేటుకు నాన్ థియేటర్ అమ్మేయడం వల్ల నిర్మాతలకు నష్టం లేకపోయింది. నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా థియేటర్ హక్కులు విక్రయించారు కానీ నాన్ థియేటర్ అమ్మలేకపోయారు. దాంతో దానికీ నష్టాలు తప్పలేదు.