అమెరికాలో వర్జీనియా ఉంది. అక్కడ అందమైన బీచ్ ఉంది. ఆ బీచ్ ఒడ్డున అల్లుకుని ఐటీ సెక్టార్ ఉంది. దాంతో బ్రహ్మాండమైన ఐటీ సిటీగా అది రూపుదిద్దుకుంది. ఇపుడు ఈ పోలిక ఎందుకు అంటే విశాఖను కూడా వర్జీనియా సిటీ మాదిరిగా చేయాలని వైసీపీ సర్కార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంది.
బీచ్ ఐటీ సిటీ అన్నది లేటెస్ట్ ప్లాన్. బీచ్ ఉన్న చోట టూరిజం తో పాటు ఐటీని కూడా డెవలప్ చేస్తూ రెండిందాలుగా సిటీని అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఐటీ యూనికార్న్ గా విశాఖను చేస్తామని వైసీఎపీ మంత్రులు అంటున్నారు.
దేశంలోనే నంబర్ వన్ స్టార్టప్ హబ్ గా విశాఖ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశ్యమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో భారీ ఎత్తున పెట్టుబడుల సదస్సు నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ చెప్పారు. ఈ సదస్సు ద్వారా విశేషంగా ఏపీకి పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని ఆయన తెలిపారు.