జనసేనాని పవన్‌కల్యాణ్ వచ్చే నెల నుంచి మొదలు పెట్టాలని భావించిన బస్సు యాత్ర వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్‌కల్యాణే ప్రకటించడం గమనార్హం.
అక్టోబర్‌లో వచ్చే దసరా పండగ శుభదినాన తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని జనసేనాని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు ఏర్పాట్లు కూడా చేపట్టారు. ప్రత్యేకంగా వాహనాలను కూడా కొనుగోలు చేశారు.
ఏమైందో తెలియదు కానీ, బస్సుయాత్రను వాయిదా వేసినట్టు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పవన్ మాట్లాడుతూ సమస్యలపై అధ్యయనం పూర్తి అయిన తర్వాతే బస్సుయాత్ర వుంటుందని స్పష్టం చేశారు. జనవాణిలో వచ్చిన అర్జీలపై అధ్యయనం చేస్తున్నట్టు పవన్‌కల్యాణ్ తెలిపారు. దీంతో బస్సుయాత్ర తిరిగి ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి.
సమస్యలపై అధ్యయనానికి మరింత సమయం తీసుకుంటున్నట్టుగా పవన్ మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది. అక్టోబర్‌కు బదులు వచ్చే ఏడాది బస్సుయాత్ర ప్రారంభించే అవకాశాలున్నాయి. అప్పటికి ఎన్నికల వాతావరణం వుంటుంది. బస్సుయాత్రనే ఎన్నికల ప్రచార యాత్రగా కూడా మలుచుకోవచ్చనే వ్యూహంతోనే పవన్ వాయిదా నిర్ణయాన్ని తీసుకుని వుండొచ్చు.