కబ్జా అడుగుజాడ కేజీఎఫ్ దే

ఒక సినిమా హిట్ అయితే గుడ్డిగా దాని వెంట పరుగులు తీసే వ్యవహారం తెలుగు సినిమాలకే కాదు కన్నడ సినిమాలకు కూడా వున్నట్లుంది. ఈ రోజు విడుదలైన కబ్ఙా అనే సినిమా ట్రయిలర్ చూస్తుంటే…

ఒక సినిమా హిట్ అయితే గుడ్డిగా దాని వెంట పరుగులు తీసే వ్యవహారం తెలుగు సినిమాలకే కాదు కన్నడ సినిమాలకు కూడా వున్నట్లుంది. ఈ రోజు విడుదలైన కబ్ఙా అనే సినిమా ట్రయిలర్ చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. 

కెజిఎఫ్ సిరీస్ అడుగు జాడల్లో తీసిన సినిమా అని క్లారిటీ గా తెలిసిపోతోంది. ఉపేంద్ర నటించిన ఈ సినిమా దేశ విభజ‌న నేపథ్యంలో సాగిన కథ, ఆ కాలంలో పుట్టుకు వచ్చిన గ్యాంగ్ స్టార్ కథ ఆధారంగా తీసినట్లు కనిపిస్తోంది. కన్నడ హీరోల్లో కాస్త పేరున్న కిచ్చా సుదీప కూడా ఈ సినిమాలో కీలకపాత్రధారి.

కథ సంగతి ఎలా వున్నా టేకింగ్, కలర్ స్కీమ్, ఎడిటింగ్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా కేజీఎప్ సిరీస్ ను ఫాలో అయిపోయినట్లు కనిపిస్తోంది. డైలాగులు లేకుండా కేవలం బ్యాక్ గ్రవుండ్ స్కోర్, ప్లే కార్డులు వేసి, సినిమా పవర్ ఫుల్ గా వుంటుందనే ఫీలింగ్ కలిగించేలా ట్రయిలర్ కట్ చేసారు. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా నాలుగైదు భాషల్లో విడుదల కాబోతోంది.

బ్యాక్ గ్రవుండ్ స్కోర్, ఎడిటింగ్ విషయంలో కూడా కేజిఎఫ్ నే ఫాలో అయ్యారు. పాత్రలు కూడా అదే పోకడలో వున్నాయి. మరి సినిమా ఆ రేంజ్ కు చేరుకుంటుందో, చేరుకోదో సినిమా విడుదలైన తరువాత కానీ తెలియదు.