ఆమె ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లోకి సర్రున దూసుకువచ్చింది. పారితోషికం అమాంతం కోటి రూపాయలకు చేరిపోయింది. చకచకా చేతిలోకి మంచి సినిమాలు వచ్చాయి.
అలాంటి హీరోయిన్ కు నటన రాదంటే నమ్మశక్యమా? కానీ ఆమెకు నటన రాదని, నటశూన్య అనే టైపులో ఓ దర్శకుడు ముక్క చీవాట్లు పెట్టాడు.
ఓ యంగ్ క్రేజీ హీరోతో ఈ హీరోయిన్ సినిమా ఓకె చేసింది. ఆ సినిమాకు పని చేస్తున్న సీనియర్ దర్శకుడు ఈమెకు సీన్ చెప్పి, నటన చూసి, నడక చూసి నివ్వెరపోయాడట.
అలా కాదు ఇలా అని, ఇలా కాదు అలా అని చెప్పి, చెప్పి విసిగిపోయి, ఇక చీవాట్లు లంకించుకున్నట్లు బోగట్టా. దాంతో సదరు హీరోయిన్ ఏడుస్తూ వెళ్లి కేరవాన్ లో కూర్చుండిపోయింది. దాంతో షూటింగ్ ఆ రోజుకు ఆగిపోయింది.
ఎలాగో తీసుకున్నారు. పైగా క్రేజ్ వుంది. అందుకని మళ్లీ ఆమెకే నచ్చ చెప్పి, షూటింగ్ కొనసాగిస్తున్నారు. తప్పదు కదా? అందంగా వున్న హీరోయిన్లు అంతా మంచి నటన వచ్చిన వాళ్లు కాదు కదా?