అక్కడ ఎంపీ టిక్కెట్ ఆశిస్తోంది…వస్తుందా?

గల్లీ నాయకుడి నుంచి ఢిల్లీ లీడర్ వరకు ప్రతి ఒక్కరి లక్ష్యం ఎన్నికల్లో పోటీ చేయడమే. అది అసెంబ్లీ ఎన్నికలు కావొచ్చు లేదా లోక్ సభ ఎన్నికలు కావొచ్చు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే మంత్రి…

గల్లీ నాయకుడి నుంచి ఢిల్లీ లీడర్ వరకు ప్రతి ఒక్కరి లక్ష్యం ఎన్నికల్లో పోటీ చేయడమే. అది అసెంబ్లీ ఎన్నికలు కావొచ్చు లేదా లోక్ సభ ఎన్నికలు కావొచ్చు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవో మరో పదవో ఆశించడం సహజం. ఇప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కూడా ఇదే ఆశల్లో ఉన్నారు. కానీ ఆమె ఆశలను పార్టీ అధిష్టానం నెరవేరుస్తుందా అనేది డౌటుగా ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం. అది బీజేపీ లక్ష్యం. ఎవరికైనా కొన్నాళ్లు సమయం ఇస్తుంది. వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తే క్షణం కూడా ఆలోచించదు. వెంటనే చర్యలకు దిగుతుంది.

ఇప్పుడు పురందేశ్వరి పరిస్థితి కూడా అంతే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆమెకు రాజ్యసభ పదవి ఇస్తారనుకున్నారు. కానీ ఉన్న పదవుల నుంచి తప్పించారు. ఆమెకు గత ఏడాది ఛత్తీస్‌ఘడ్, ఒడిశా ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే ఒడిశా బాధ్యతల నుంచి తప్పించిన అధినాయకత్వం తాజాగా ఛత్తీస్‌ ఘడ్ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించింది. ఛత్తీస్‌ఘడ్ కు రాజస్థాన్ కు చెందిన ఓం మాధర్ ను అధిష్టానం ఇన్‌ఛార్జిగా నియమించింది. పురందీశ్వరి తాము అనుకున్నట్లు పనితీరును ప్రదర్శించడం లేదన్న అభిప్రాయం అధినాయకత్వంలో ఉంది.

వచ్చే ఏడాది ఛత్తీస్‌ ఘడ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇన్‌ఛార్జిని మార్చడం పార్టీ నాయకత్వానికి అనివార్యమయింది. అక్కడ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలంటే పురందేశ్వరితో  సాధ్యం కాదని అధిష్టానం భావించింది. అందుకే ఆమెను తప్పించి ఓం మాధుర్ ను నియమించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓం మాధుర్ అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. పురందేశ్వరి తమ అంచనాలకు తగినట్లు పనిచేయడం లేదని అధినాయకత్వం భావించిందంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నేతలకు పదవులు ఇవ్వకపోగా ఉన్న పదవులను పీకేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పురందేశ్వరి నిజానికి పార్టీ పట్ల నిబద్దతగానే వ్యవహరిస్తారు. అయితే ఆమె గత కొంతకాలంగా అక్కడ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం, అక్కడి నేతలకు అందుబాటులో ఉండకపోవడం కూడా అధినాయకత్వం దృష్టికి వెళ్లింది. దీంతోనే ఇప్పటికే ఒడిశా ఇన్‌ఛార్జి నుంచి తప్పించిన అధిష్టానం తాజాగా ఛత్తీస్‌ఘడ్ నుంచి కూడా తప్పించింది. ఆంధ్రప్రదేశ్ ను భారతీయ జనతా పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ పార్టీ ఎదుగుదల కష్టమేనని బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలియంది కాదు. అందుకే ఏ పోస్టులను భర్తీ చేయాలనుకున్నా పార్టీ హైకమాండ్ ఏపీ వైపు చూడటం లేదు.

ఏపీకి ప్రాధాన్యత ఇచ్చేకంటే ఇతర రాష్ట్రాలకు ఇస్తే కొద్దో గొప్పో ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న అధిష్టానం పార్టీ నేతలను లైట్ గానే తీసుకున్నట్లు కనపడుతుంది. ఇక‌, ప్ర‌స్తుతం పురందేశ్వరి కేవ‌లం.. చేరిక‌ల క‌మిటీ బాధ్యురాలిగా మాత్ర‌మే ఉన్నారు. అయితే  వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి పోటీ చేయాల‌ని.. గెలిచి.. కేంద్రంలో మంత్రిపీఠాన్ని ద‌క్కించుకోవాల‌నేది.. పురందేశ్వ‌రి ఆకాంక్ష‌. అయితే.. ఆమె కోరుకున్న‌ట్టుగా.. విశాఖ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేదని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

ఇక్క‌డ నుంచి ఒక కీల‌క నేత టికెట్ ఆశిస్తున్నారు. గ‌తంలో కూడా ప్ర‌య‌త్నించినా.. ఆయ‌న‌ కోరిక నెరవేరలేదు. ఇప్పుడు మాత్రం గ‌ట్టిగానే టికెట్ కోసం.. ఓ కీల‌క నాయ‌కుడితో సిఫార‌సు చేయిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ ప‌రిణామాల‌తో చిన్న‌మ్మ‌కు ఆశ‌లు నెర‌వేరే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సీటే ద‌క్క‌క‌పోతే.. ఆమె గెలిచేదెలా.. ఇక‌, మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకునేదెలా? అని అంటున్నారు ప‌రిశీల‌కులు. మరి ఆమె అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.