Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్ తో జీవిత భేటీ?

పవన్ తో జీవిత భేటీ?

భాజపా తరపున ఈసారి ఎన్నికల బరిలోకి దిగాలని బలంగా నిర్ణయించుకున్న సీనియర్ హీరోయిన్ జీవిత ఈ రోజు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ను కలిసారని బోగట్టా. 

ఇద్దరి మధ్య పదిహేను నిమషాలకు పైగానే చర్చలు జరిగాయని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ బరిలోకి దిగాలని జీవిత భావిస్తున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇటీవల భాజపా నాయకులను కూడా కలిసినట్లు వార్తలు వచ్చాయి. భాజపా-జనసేన కలిసి పని చేస్తున్నందున పవన్ కళ్యాణ్ ను కూడా కలిసి వుండొచ్చు.

లేదా తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర నుంచి పోటీ చేయాలని ఏమైనా అనుకుంటున్నారా? రాజశేఖర్ తమిళ మూలాలు వున్నందున, చిత్తూరు జిల్లా నుంచి ఏమైనా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారా?

ప్రస్తుతానికి ఇవన్నీ సందేహాలే. జీవిత రాజకీయంగా యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్నది మాత్రం స్ఫష్టం. అందులో భాగంగానే ఈ ఉదయం పవన్ కళ్యాణ్ ను కలిసి, చర్చలు జరిపి వుండొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?