వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో కొడాలి నాని చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేవలం చంద్రబాబు తన సొంత సామాజిక వర్గం వారి బాగుకోసమే అమరావతి పాదయాత్ర పేరుతో డ్రామా అడుతున్నారంటూ మండి పడ్డారు. కమ్మ కులం వారిపై ద్వేషంతో మూడు రాజధానులు తెచ్చారంటున్నా చంద్రబాబు వైజాగ్ లో కూడా రాజకీయంగా, సామాజికంగా కమ్మ కులంమే ఎక్కువ ఉందని తెలుసుకోవాలని కొడాలి నాని హితవు పలికారు.
అమరావతిని కమ్మరావతిని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు అని అందుకోసమే ఖమ్మం జిల్లాలో కార్పొరేటర్ గా కూడా గెలవనేని రేణుక చౌదవిని అమరావతికి తీసుకువచ్చి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్నారు. అమరావతిలో పేదలు ఎవరూ రాకుండా చేయడం చూసి ప్రజలందరూ అమరావతి కేవలం కమ్మ వారిదే అనేలాగా చేశారన్నారు.
అమరావతి చూట్టూ తన సామాజిక వర్గం వారికే భూములు ఇచ్చి, పేద రైతులకు ఇంత వరకు ఫ్లాట్స్ పంచకుండా చంద్రబాబు మోసం చేసి ఇప్పుడు డ్రామాలు అడుతున్నారన్నారు. గ్రాఫిక్స్ లో అమరావతి కట్టి అప్పట్లో అమరావతి రైతులను మోసం చేసి ఇప్పుడు డ్రామాలు అడుతున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు ఆ నలుగురు మీడియా అధిపతుల చేతుల్లో కీలు బోమ్మగా మరి వారు ఎలా చెప్పితే అలా ఆడుతున్నారన్నారు.
ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ చేస్తున్నారని. సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.