సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది అదాశర్మ. అంతేకాదు, ఆధునిక పోకడలు, సంప్రదాయ పద్ధతులపై ఆమె పెద్దపెద్ద మాటలు మాట్లాడుతోంది. నేటి ఆధునిక కాలపు విధానాలు ఎంత మాత్రం సరైనవి కాదని ఆమె అభిప్రాయం.
ఇటీవల ‘టిండే’ అనే షార్ట్ ఫిల్మ్‌తో ఆమె ప్రేక్షకుల ముందుకొచ్చింది. డేటింగ్ యాప్స్, వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో అదాశర్మ నటనకి ప్రేక్షకులతో పాటు సినీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా అదాశర్మ మాట్లాడుతూ డేటింగ్ యాప్ సంస్కృతికి తాను వ్యతిరేకమన్నారు. వాటిని తానెప్పుడూ ఉపయోగించలేదన్నారు.
అంతేకాదు, నేటి ఆధునిక కాలంలోనూ తాను ఓల్డ్ స్కూల్ రొమాన్స్‌నే ఇష్టపడతానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వివాహేతర సంబంధాల్ని తానెంత మాత్రం ఆమోదించనన్నారు. అలాంటి సంబంధాలకు తాను వ్యతిరేకమన్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలన్నారు. జీవితాంతం అతనితోనే బంధాన్ని కొనసాగించాలని అదా శర్మ స్పష్టం చేశారు.
ఒకవేళ కలిసి ఉండలేమని నమ్మకం లేనప్పుడు పెళ్లికి దూరంగా ఉండటమే మంచిదని హితవు పలికారు. అనైతిక బంధాలు ఏ మనిషినైనా దిగజార్చుతాయన్నారు. నైతిక విలువలు ఉండే వాడినే లైఫ్ పార్టనర్‌గా ఎంచుకుంటానని అదా శర్మ స్పష్టం చేశారు. ఆల్ ది బెస్ట్ అదా శర్మ.