మంచి టైమింగ్ తో కామెడీ సినిమాలు బాగా తీస్తాడని పేరు తెచ్చుకున్నారు దర్శకుడు నాగేశ్వర రెడ్డి. కానీ ఆ పేరు ఫేడవుట్ కావడానికి కూడా ఎంతో కాలం పట్టలేదు.
వరుస పరాయాలతో సతమతమవుతున్న నాగేశ్వర రెడ్డి ఈసారి హీరోయిజాలు తదితర వ్యవహారాల జోలికి పోకుండా పక్కా ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి ఫిక్స్ అయిపోయారు.
అందుకే సునీల్, ధన్ రాజ్ లతో ఓ పక్కా ఫక్తు కామెడీ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు 'బుజ్జీ ఇలా రా' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసారు. గరుడవేగ అంజి నిర్మాత. అయితే ఫన్ సినిమాకు 'ఇట్స్ ఆల్సో ఏ సైకలాజికల్ థ్రిల్లర్' అని ట్యాగ్ లైన్ పెట్టడం విశేషం. అంటే హర్రర్ కామెడీ మాదిరిగా ధ్రిల్లింగ్ కామెడీ అనుకోవాలేమో?
ఇక అసలు సిసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాకు నాగేశ్వర రెడ్డి దర్శకుడు కాదు. ఆయన కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ, నిర్మాణంలో భాగస్వామిగా వుంటున్నారు.
గరుడవేగ అంజి వుంటూనే దర్శకత్వం చేపడుతున్నారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాందిని తమిళసన్ సాయికార్తీక్ సంగీతం.