కొన్ని వారాల క్రితం వరకు పెద్ద సినిమాలు ఊపిరి సలపనంతగా విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ నెలంతా చిన్న సినిమాలదే రాజ్యం అన్నట్లుగా వుంది. నెలాఖరున పొన్నియన్ సెల్వం వచ్చే వరకు అన్నీ చిన్న సినిమాలే.
చిన్న అంటే మరీ చిన్న సినిమాలు కాదు కానీ మిడ్ రేంజ్ సినిమాలు కూడా ఈ జాబితాలో వున్నాయి. రంగ రంగ వైభవంగా…ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు తొలివారం తెరమీదకు వచ్చాయి. రెండూ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యాయి. మలివారం ఒకే ఒక జీవితం సినిమా విడుదలయింది. ఒకె అనిపించుకుంది. బ్రహ్మాస్త్ర భారీ సినిమానే కానీ మన తెలుగు ఖాతాలోకి రాదు.
మూడో వారం 16న చాలా సినిమాలు వున్నాయి. వీటిలో కిరణ్ అబ్బవరం..మీకు బాగా కావాల్సిన వాడిని, సుధీర్ బాబు ..ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. నివేదా-రెజీనాల ‘శాకిని..ఢాకిని’ కీలకంగా వున్నాయి. ఇవి కాక ఎవరికీ పెద్దగా పట్టని మరో నాలుగయిదు సినిమాలు కూడా అదే రోజు విడుదలవుతున్నాయి. సరైన హిట్ కోసం చూస్తున్న కిరణ్ అబ్బవరం, వి సినిమా తరువాత మళ్లీ తన మార్కు చూపించాలనుకుంటున్న దర్శకుడు ఇంద్రగంటి లకు ఈ వారం కీలకం.
నాలుగోవారం లో నాగశౌర్య ‘కృష్ణ వృింద విహారి’… శ్రీవిష్ణు ‘అల్లూరి’.. సత్యదేవ్ ..’గుర్తుందా సీతాకాలం’..దొంగలున్నారు జాగ్రత్త సినిమాలు వున్నాయి. వీటిలో శౌర్య, శ్రీవిష్ణు సినిమాలకే కాస్త పబ్లిసిటీ హడావుడి కనిపిస్తోంది.
నెలాఖరు వారాన్ని మాత్రం టాలీవుడ్ వదిలేసింది. ఆపైన దసరా సీజన్ స్టార్ట్ అవుతుంది కనుక మళ్లీ పెద్ద సినిమాల తాకిడి ప్రారంభం అవుతుంది.