వేదం సినిమా నుంచి ఎన్టీఆర్ బయోపిక్ వరకు దర్శకుడు క్రిష్ చేసిన ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన జ్ఞానశేఖర్ నిర్మాతగా మారుతున్నారు. ఒక కొత్త దర్శకురాలని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అలాగే ఓ కొత్త హీరోను కూడా. సృజన అనే కొత్త దర్శకురాలు అందిస్తున్న క్రికెట్ నేపథ్యంలోని కథను ఆయన నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు.
పెళ్లిచూపులు వంటి సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో క్రికెట్ నేపథ్యంలో వున్న ముస్లిం యువకుడి పాత్రలో కనిపిస్తాడు. కథను విన్న తరువాత డెసిషన్ చెబుతా అన్న, సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆ మాట మేరకు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
జ్ఞానశేఖర్ కు సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు వుంది. మణికర్ణికతో సహా క్రిష్ సినిమాలు అన్నింటికీ ఆయన పనిచేసారు. మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఇప్పుడు ఇలా తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు.