సైలెంట్ గా ఓ సినిమాకు ఓకే చెప్పిన అనసూయ

సినిమాల విషయంలో అనసూయ ఎంత సెలక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కథలు, పాత్రల ఎంపికపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు గతంలో ఆమె వెల్లడించింది. కేవలం పారితోషికం కోసం తను సినిమాలు చేయనని,…

సినిమాల విషయంలో అనసూయ ఎంత సెలక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కథలు, పాత్రల ఎంపికపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు గతంలో ఆమె వెల్లడించింది. కేవలం పారితోషికం కోసం తను సినిమాలు చేయనని, తనకు టీవీ ద్వారా చాలా డబ్బు వస్తుందని, సినిమాల ద్వారా తను గుర్తింపును మాత్రమే కోరుకుంటున్నానని క్లియర్ గా చెప్పేసింది.

ఇందులో భాగంగా మంచి పాత్రలు ఎంచుకుంటున్న అనసూయ, తాజాగా మరో సినిమాకు సైలెంట్ గా సైన్ చేసింది. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో అనసూయ పాత్రే హైలెట్ అవుతుందట. అనసూయ ఇందులో ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుంది.

ఇదొక ఆంథాలజీ మూవీ. 6 కథల సమ్మేళనం. ప్రతి కథలో ఓ లీడ్ ఉంటారు. అలా అనసూయ కథ ఇందులో హైలెట్ అవుతుందంటున్నారు. ఇంతకుముందు పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో దర్శకుడిగా అందరిని ఆకట్టుకున్న జయశంకర్.. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 

వచ్చే నెల నుంచి అనసూయ సెట్స్ లో జాయిన్ అవుతుంది. చికాగోకు చెందిన వ్యాపారవేత్త ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. 

క్షణం, రంగస్థలం సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ప్రస్తుతం పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న అనసూయ.. జయశంకర్ తీస్తున్న ఆంథాలజీ సినిమాకు ఓకే చెప్పడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది.