తొలి బడ్జెట్‌కే తొందరైతే ఎలా చంద్రబాబూ.!

కొత్త ప్రభుత్వానికి ఆరునెలల సమయం ఇస్తామన్న మాటని నెల రోజులకే అటకెక్కించేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. మాటతప్పడం, మడమ తిప్పడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని మరోసారి ప్రూవ్‌ అయ్యింది.. ఆయనగారి…

కొత్త ప్రభుత్వానికి ఆరునెలల సమయం ఇస్తామన్న మాటని నెల రోజులకే అటకెక్కించేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. మాటతప్పడం, మడమ తిప్పడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని మరోసారి ప్రూవ్‌ అయ్యింది.. ఆయనగారి తాజా నిర్వాకంతో. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తొలి బడ్జెట్‌ని ఈరోజు ప్రవేశపెట్టింది. 2 కోట్ల 27 లక్షల 974 కోట్ల రూపాయల అంచనాలతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం విదితమే. అయితే, ఈ బడ్జెట్‌పై అప్పుడే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టడం షురూ చేసింది.

నిజానికి ఇంత భారీస్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదే. కానీ, తప్పదు. ప్రజల ఆకాంక్షల సంగతెలా వున్నా, ఆ స్థాయిలో ఎన్నికల హామీల్ని ఇచ్చేశారు కాబట్టి.. వైఎస్‌ జగన్‌, అంచనాలకు మించేలా బడ్జెట్‌ పెట్టి తీరాల్సిందే. బడ్జెట్‌ పెట్టారు.. కేటాయింపులూ బాగానే వున్నాయ్‌.. కానీ, వాటికోసం నిధులు ఎలా తీసుకొస్తారన్నది వేచిచూడాల్సిన విషయం. తెలుగుదేశం పార్టీ లెక్కల ప్రకారం, 48 వేల కోట్ల అప్పులు చేయాల్సిన పరిస్థితిని జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చిందట.

సరే, బడ్జెట్‌పై ఎలాగూ చర్చ జరుగుతుంది. ఆ చర్చ సందర్భంగా ప్రభుత్వం వివరణ కూడా ఇస్తుంది. అప్పుడెలాగూ నిలదీసే అవకాశం తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. నిజానికి, ఆయా పథకాలకు సంబంధించి కేటాయింపులపై జగన్‌ సర్కార్‌, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పితీరాలి అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీలో ఎటూ నోరు పెగిలే అవకాశం లేదు గనుక.. అన్నట్టు, తెలుగుదేశం పార్టీ నేతలు తొందరపడిపోతున్నారు. ఈ లిస్ట్‌లో చంద్రబాబు మిగతా టీడీపీ నేతలందరికన్నా ముందున్నారు.

ప్రజలపై అస్సలేమాత్రం భారం మోపకుండా, సంక్షేమానికి పెద్ద పీట వేశామని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ విషయమై చాలా స్పష్టంగా వున్నారు. అలా అధికార పార్టీ కాన్ఫిడెంట్‌గా వుండడమే టీడీపీకి నచ్చడంలేదనుకోవాలేమో.! అఫ్‌కోర్స్‌, అధికార పార్టీ ఏం చేసినా, ప్రతిపక్షానికి నచ్చదనుకోండి.. అది వేరే విషయం. గడచిన ఐదేళ్ళలో తెలుగుదేశం పార్టీ బడ్జెట్‌తో ఏం ఉద్ధరించిందో చెప్పలేని స్థితిలో వున్న టీడీపీ నేతలు, జగన్‌ సర్కార్‌ తొలి బడ్జెట్‌ మీదనే రంకెలేయడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?