హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత సర్వే చేయించారట.
ఆయనే ఈ విషయం వెల్లడిస్తూ, హుజూరాబాద్ లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అనుకూల వాతావరణం ఉందని, 64 శాతం మంది ఆయనకు మొగ్గు చూపుతుండగా, టిఆర్ఎస్ కు 30 శాతమే సానుకూలత ఉందని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ కు కేవలం ఐదు శాతం ఓట్లే వచ్చేలా ఉన్నాయని ఆయన అన్నారు. అభ్యర్దుల ప్రకటన తర్వాత పరిస్తితి కొంత మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని, వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్ చూసుకోవాలని ఆయన అన్నారు. కాగా మంత్రి కెటిఆర్ మిత్రుడు తేజరాజు చేతిలోనే తెలంగాణ పాలన ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సత్యం రామలింగరాజు కుమారుడే తేజ అని ఆయన అన్నారు.