ఎఫ్ 3..ఫోర్తే డే టెస్ట్ పాస్

ఏ సినిమాకు అయినా, ఎలాంటి సినిమాకు అయినా రెండు సమస్యలు. ఓపెనింగ్ ఎలా వుంది? ఫస్ట్ మండే ఎలా వుంది? ఎఫ్ 3 సినిమాకు ఓపెనింగ్ డే మార్నింగ్ షో లు యావరేజ్ గా…

ఏ సినిమాకు అయినా, ఎలాంటి సినిమాకు అయినా రెండు సమస్యలు. ఓపెనింగ్ ఎలా వుంది? ఫస్ట్ మండే ఎలా వుంది? ఎఫ్ 3 సినిమాకు ఓపెనింగ్ డే మార్నింగ్ షో లు యావరేజ్ గా స్టార్ట్ అయ్యాయి. 

వర్డ్ ఆఫ్ మౌత్, రివ్యూలు ఆల్ మోస్ట్ పాజిటివ్ గా వుండడంతో ఫస్ట్ షో ల నుంచి అందుకుంది. ఫస్ట్ వీకెండ్ బాగానే వెళ్లింది. ఫిఫ్టీ పర్సంట్ వరకు రికవరీ వచ్చింది. 

ఇక రెండో టెస్ట్..మండే. మండే మార్నింగ్ షో ల ఆన్ లైన్ బుకింగ్ చూసిన వారందరికీ ఇక సమస్యే అనిపించింది. కానీ మళ్లీ మాట్నీల దగ్గర నుంచి ఫుల్స్ ప్రారంభమయ్యాయి. మొత్తం మీద మండే టెస్ట్ పాస్ అయింది. 

ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, నెల్లూరులతో పోల్చుకుంటే కృష్ణా, గుంటూరు తక్కువ వున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా వుండడం ఓ రీజన్ అంటున్నారు. సీడెడ్ కూడా ఫరవాలేదు అనిపించుకుంది. నైజాం ఎలాగూ బాగానే వుంది.

ఇక్కడ నుంచి వీకెండ్ వరకు అలా అలా వెళ్లిపోతే, మళ్లీ వీకెండ్ రెండు రోజులు గట్టిగా లాగాల్సి వుంటుంది. ఎందుకంటే మళ్లీ థర్డ్ వీకెండ్ వుండడం కష్టం. 

ఎందుకంటే నాని ఫన్ ఎంటర్ టైనర్ అంటే సుందరానికి విడదలయ్యేది ఆ వారమే. ఈవారం కూడా సినిమాలు వున్నాయి కానీ ఫన్ ఎంటర్ టైనర్లు లేకపోవడం ఎఫ్ 3 అదృష్టం.