అందరూ ఎనిమిది..పది కోట్లే

చిన్న సినిమాలు..మిడ్ రేంజ్ సినిమాలు…పెద్ద సినిమాలు. ఇవే టాలీవుడ్ లో కీలకం. చిన్న సినిమాలు తీస్తుంటే థియేటర్ కు జనం రావడం అన్నది అరుదుగా జరుగుతోంది. భారీ సినిమాలు అందరికీ అందవు..అందరకీ కుదరవు. కానీ…

చిన్న సినిమాలు..మిడ్ రేంజ్ సినిమాలు…పెద్ద సినిమాలు. ఇవే టాలీవుడ్ లో కీలకం. చిన్న సినిమాలు తీస్తుంటే థియేటర్ కు జనం రావడం అన్నది అరుదుగా జరుగుతోంది. భారీ సినిమాలు అందరికీ అందవు..అందరకీ కుదరవు. కానీ మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం కాస్త అవకాశం వున్న ఎవరైనా ట్రయ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఆ మిడ్ రేంజ్ సినిమాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. 

ఒకప్పుడు మిడ్ రేంజ్ సినిమా తీయాలంటే 20 కోట్లతో పని పూర్తయ్యేది. కానీ ఇప్పుడు రెమ్యూనిరేషన్లే 15 కోట్లకు చేరుకుంటున్నాయి. సినిమా నిర్మాణానికి 30 కోట్లు అవసరం అవుతున్నాయి. మిడ్ రేంజ్ సినిమాల్లో మళ్లీ కాస్త పెద్దవి వున్నాయి. అవి అయితే నలభై నుంచి యాభై కోట్లకు డేకేస్తున్నాయి.

నాన్ థియేటర్ హక్కులు పెరగడం అనే సాకు చూపి రెమ్యూనిరేషన్లను హీరోలు అందరూ పెంచేసారు. ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు ఎవ్వరూ ఎనిమిది కోట్ల లోపు అందుబాటులో లేరు. సాయి ధరమ్ తేజ్ ఎనిమిది కోట్లు, వరుణ్ తేజ్ 10 కోట్లు, నాని 12 కోట్లు, శర్వానంద్ ఎనిమిది కోట్లు, నితిన్ ఎనిమిది కోట్లు, రామ్ 12 కోట్లు, చైతన్య 10 కోట్లు, ఈ రేంజ్ లో అడుగుతున్నారని టాలీవుడ్ నిర్మాతల సర్కిళ్లలో వినిపిస్తోంది.

సీనియర్లలో వెంకటేష్ 12 కోట్లు, రవితేజ 18 కోట్లు, బాలయ్య 12 కోట్లు రేంజ్ లో వున్నారని వినిపిస్తోంది. మిడ్ రేంజ్ జనాలు అందరికీ థమన్ లేదా దేవీశ్రీప్రసాద్ వుంటే బాగుండును అనిపిస్తుంది. అక్కడ మరో మూడు కోట్లు యాడ్ అవుతోంది. మంచి డివోపీ వుండాలి. కోటిన్నర కావాల్సిందే. ఇలాంటి సినిమాకు కొత్త డైరక్టర్ అయితే వేరే సంగతి. కాస్త నోటెడ్ డైరక్టర్ అయితే మినిమమ్ అయిదు కోట్లు. ఆ పైన. 

హీరోయిన్లు కూడా కాస్త నోటెడ్ అయితే కనీసం 75 లక్షల దగ్గర బేరం మొదలవుతుంది. ఒక్క సరైన హిట్ పడి క్రేజ్ వస్తే కోటి రూపాయలు కావాల్సిందే. ఇదంతా కలిపి 20 కోట్లకు చేరిపోతే, నిర్మాణానికి మరో ఇరవై కోట్లు కావాల్సి వస్తోంది. తీరా చేసి నాన్ థియేటర్ వచ్చినా, ధియేటర్ మీద బర్డెన్ పది కోట్లు ఆ పైన వుండిపోతోంది. అక్కడ వస్తోంది సమస్య. థియేటర్లకు జనం రావడం అన్నది దైవాధీనం అయిపోయింది. దాంతో నష్టాలు తప్పడం లేదు. 

ప్రస్తుతానికి మిడ్ రేంజ్ హీరోలు అందరి చేతినిండా సినిమాలు వున్నాయి. ఇవన్నీ పూర్తయి, విడుదలైన తరువాత ఎకనామిక్స్ క్లారిటీ వస్తుంది. అప్పుడు కానీ మిడ్ రేంజ్ సినిమాల భవిష్యత్ తేలదు.