షూటింగ్ లు ఆపాలంటున్న ఆర్జీవీ

సీనియర్ హీరో కృష్ణం రాజు మృతికి సంతాపంగా రెండు రోజుల పాటు షూటింగ్ లు ఆపాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన నిన్న అర్థరాత్రి దాటిన తరువాత వరుస…

సీనియర్ హీరో కృష్ణం రాజు మృతికి సంతాపంగా రెండు రోజుల పాటు షూటింగ్ లు ఆపాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన నిన్న అర్థరాత్రి దాటిన తరువాత వరుస ట్వీట్ లు వేసారు. గొప్ప, నటుడు నిర్మాత కన్నుమూస్తే రెండు రోజులు షూటిింగ్ లు ఆపలేని పరిస్థితి చూస్తుంటే సిగ్గు సిగ్గు అంటూ మొదలు పెట్టారు. ఆపై సీనియర్ హీరోలను ట్యాగ్ చేస్తూ, రేపు ఈ పరిస్థితి అందరికీ తప్పదని, మన చావులను మనమే గౌరవించేలా చేయాలంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు.

మొత్తం మీద అర్థరాత్రి దాటిన తరువాత ఆర్జీవీ వేసిన ట్వీట్ లకు స్పందన వచ్చింది కానీ నెటిజన్లు ఎవ్వరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకుంటే ఆ టైమ్ లో ఆర్జీవీ ఏ పొజిషన్ లో వుండి వుంటారో జనాలకు తెలిసిన సంగతే. పైగా దీనికి కొంత మంది కులాల లింక్ కూడా పెడుతూ కామెంట్ చేసారు.

బహుశా ఈ రోజున ఆర్జీవీ ని తీసుకువచ్చి డిస్కషన్ కు కూర్చో పెట్టడానికి ఓ చానెల్ రెడీగా వుండి వుండొచ్చు. ఆర్జీవీ గమనించాల్సింది ఏమిటంటే కృష్ణం రాజు కు చాలా ఘనమైన వీడ్కోలు లభించింది. టాలీవుడ్ లో ఎంతో మంది మహా మహుల మరణాలు చాలా సాదా సీదాగా వెళ్లిపోయాయి. మరణించిన వారి పిల్లలు మంచి పొజిషన్ లో వుంటే, వారితో ఇండస్ట్రీ జనాలకు అవసరం వుంటే ఇక్కడ చావులు కూడా ఘనంగా వుంటాయి. లేదూ అంటే సాదా సీదాగా వుంటాయి.

పిల్లలు ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో వుంటే, వారితో అవసరాలు వుంటే టాలీవుడ్ లో చావు కూడా పెళ్లిలాంటిదే. మంచి నటులు ధర్మవరపు, ఎవిఎస్, ఇలా చాలా అంటే చాలా మంది నటుల మరణాలు గుర్తు తెచ్చుకుంటే అర్థం అవుతుంది పరిస్థితి.