ప్ర‌భోద్ చేతుల మీదుగా.. కృష్ణంరాజు అంత్యక్రియలు

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్‌లో తీవ్రవిషాదం నెలకొంది. ఈ రోజు కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణా ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరపబోతోంది. మొయినాబాద్ వ‌ద్ద క‌న‌క‌మామిడి ద‌గ్గ‌ర ఉన్న త‌న‌ ఫాంహౌస్ లో అధికారిక…

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్‌లో తీవ్రవిషాదం నెలకొంది. ఈ రోజు కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణా ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరపబోతోంది. మొయినాబాద్ వ‌ద్ద క‌న‌క‌మామిడి ద‌గ్గ‌ర ఉన్న త‌న‌ ఫాంహౌస్ లో అధికారిక లాంఛ‌నాల‌తో ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

హీరో ప్ర‌భాస్ సోద‌రుడు ప్ర‌భోద్ చేతుల మీదుగా కృష్ణం రాజు అంతిమ సంస్కారాల‌ను నిర్వ‌హించానున్నారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు మాత్రమే అనుమతించారు.

ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న‌ నివాసంలో ఉన్న ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు కడసారి నివాళులర్పిస్తున్నారు. 56 ఏళ్లకు పైగా సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న కృష్ణంరాజు.. ఎన్నో గొప్ప సినిమాల్లో న‌టించారని సిని పెద్ద‌లు కొనియాడారు.

ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో రారాజుగా వెలిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎప్ప‌టికి త‌ర‌గని తనదైన ముద్ర వేసుకున్నారు.