ఇస్మార్ట్ శంకర్ సినిమా బిజినెస్ క్లోజ్ అయింది. రెండు ట్రయిలర్లు, టీజర్, సాంగ్స్ వగైరా పబ్లిసిటీ మెటీరియల్ బాగానే వర్కవుట్ అయింది. సినిమాను తెలుగు రాష్ట్రాల మొత్తంమీద నలుగురు బయ్యర్లకు విక్రయించారు. సీడెడ్ హక్కులను ఫైనాన్సియల్ లావా దేవీల్లో భాగంగా శోభన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. నైజాం హక్కులను వరంగల్ కు చెందిన బయ్యర్ కు ఇచ్చారు. ఆరుకోట్లకు పైగా అని యూనిట్ వర్గాల బోగట్టా. అయితే ఈ రేటు మీద భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ కాస్త తక్కువ వుంది.
ఆంధ్ర ఏరియాను ఆరుకోట్ల రేషియోలో ఇచ్చారని అంటున్నారు..కానీ అయిదున్నర కోట్లు అని కూడా వినిపిస్తోంది. గుంటూరు, వెస్ట్ మినహా మిగిలిన ఏరియాలు అన్నీ అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా తీసుకున్నారు. ఆ విధంగా మొత్తం బిజినెస్ క్లోజ్ అయింది. ఓవర్ సీస్ ను గ్రేట్ ఇండియా ఫిలింస్ కు పంపిణీకి ఇచ్చారు. ఇప్పటికే నాన్ థియేటర్ రైట్స్ మీద మంచి మొత్తమే వచ్చింది నిర్మాత చార్మికి.
అన్నీకలిపి సినిమాకు అద్భుతంగా కాకపోయినా, టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు బోగట్టా. ఇటీవలి కాలంలో పూరి డైరక్షన్ లో మాత్రం బజ్ వచ్చిన సినిమా ఇదే. ఈ సినిమాకు ప్రచారం విషయంలో తీసుకున్న జాగ్రత్తలు బాగానే ఫలించాయి.